రాష్ట్రపతి పదవిని చేపట్టే అవకాశాన్ని అటల్ బిహారీ వాజ్‌పేయి(Atal Bihari Vajpayee) వదిలేసుకున్నారా? అద్వానీకి(Adhvani) ప్రధానమంత్రి పదవి వచ్చినట్టే వచ్చి చేజారిందా? అంటే అవుననే అంటున్నారు వాజ్‌పేయి దగ్గర మీడియా సలహాదారుగా పని చేసిన అశోక్ టాండన్(Ashok Tandon). ది రివర్స్ స్వింగ్ కలోనియలిజం టు కో ఆపరేషన్(The reverse swing colonialism to co operation) అనే పుస్తకంలో ఆయన సంచలన విషయాలు రాసుకొచ్చారు. 1998-2004 వరకు వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్నారు.
రాష్ట్రపతి పదవిని చేపట్టే అవకాశాన్ని అటల్ బిహారీ వాజ్‌పేయి(Atal Bihari Vajpayee) వదిలేసుకున్నారా? అద్వానీకి(Adhvani) ప్రధానమంత్రి పదవి వచ్చినట్టే వచ్చి చేజారిందా? అంటే అవుననే అంటున్నారు వాజ్‌పేయి దగ్గర మీడియా సలహాదారుగా పని చేసిన అశోక్ టాండన్(Ashok Tandon). ది రివర్స్ స్వింగ్ కలోనియలిజం టు కో ఆపరేషన్(The reverse swing colonialism to co operation) అనే పుస్తకంలో ఆయన సంచలన విషయాలు రాసుకొచ్చారు. 1998-2004 వరకు వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలోనే 2002లో రాష్ట్రపతి(Governor) ఎన్నికలు వచ్చాయి. అద్వానీకి ప్రధానమంత్రి పదవిని అప్పగించేసి, రాష్ట్రపతి పదవికి ఎన్టీయే తరఫు అభ్యర్థిగా నామినేషన్ వేయాలని వాజ్‌పేయి సన్నిహితులు ఆయనకు సలహా ఇచ్చారట! అయితే వాజ్‌పేయి ఆ సలహాను సున్నితంగా తిరస్కరించారు. తన తిరస్కరణకు కారణం కూడా చెప్పారు. ఎలక్టొరల్ కాలేజీలో మెజారిటీతో ప్రస్తుత ప్రధాన మంత్రి రాష్ట్రపతి కావడం ప్రజాస్వామిక దేశానికి శుభసూచకం కాదనేది వాజ్‌పేయి అభిప్రాయం. అందుకే అబ్దుల్ కలాంను రాష్ట్రపతి అభ్యర్థిగా వాజ్‌పేయి సిఫారసు చేశారు అని అశోక్ టాండన్ తన పుస్తకంలో తెలిపారు.