Asaduddin Owaisi : సమస్య దేశంలో ఉంది.. సరిహద్దులో కాదు
లోక్‌సభలో(Lok sabha) మణిపూర్(Manipur) హింస విషయమై కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఏఐఎంఐఎం(AI) అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) మాట్లాడారు. బీజేపీ(BJP) క్విట్ ఇండియా క్యాంపెయిన్(Quit INDIA) పై ఆయన ఫైర్ అయ్యారు. బీజేపీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని ఒవైసీ ఆరోపించారు. దేశంలో విద్వేషపూరిత వాతావరణం నెలకొని ఉందన్నారు. ప్రభుత్వం UCC తీసుకురావడంపై మొండిగా వ్యవహరిస్తుందన్నారు.
లోక్‌సభలో(Lok sabha) మణిపూర్(Manipur) హింస విషయమై కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఏఐఎంఐఎం(AI) అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) మాట్లాడారు. బీజేపీ(BJP) క్విట్ ఇండియా క్యాంపెయిన్(Quit INDIA) పై ఆయన ఫైర్ అయ్యారు. బీజేపీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని ఒవైసీ ఆరోపించారు. దేశంలో విద్వేషపూరిత వాతావరణం నెలకొని ఉందన్నారు. ప్రభుత్వం UCC తీసుకురావడంపై మొండిగా వ్యవహరిస్తుందన్నారు. హిజాబ్‌ను సమస్యగా మార్చారని.. ముస్లిం బాలికలకు చదువును నిరాకరించారన్నారు.
ప్రధాని మోదీకి(Modi) పస్మాండ ముస్లింలపై చాలా ప్రేమ ఉంది. కానీ ఆయన మంత్రివర్గంలో ఒక్క ముస్లిం కూడా లేరని అన్నారు. మణిపూర్ హింసపై(Manipur) ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఒవైసీ.. మణిపూర్‌లో ఆయుధాలు దోచుకుంటున్నారని అన్నారు. యాభై వేల మంది నిరాశ్రయులయ్యారు. ఆరు లక్షల ఆయుధాలను దోచుకుంటున్నారు. చైనా మన భూమిపై కూర్చోలేదా? సమస్య దేశంలో ఉంది.. సరిహద్దులో కాదని అన్నారు. కులభూషణ్ జాదవ్‌ని ఎందుకు వెనక్కి తీసుకురాకూడదు? అని ప్రశ్నించారు. బిల్కిస్ బానోకు న్యాయం జరగాలి కదా అని.. ఆమె దేశ పుత్రిక కాదా అని నిలదీశారు.
నూహ్‌లో 750 భవనాలు ముస్లింలు అనే కారణంతో నేలమట్టం అయినప్పుడు.. ఈ ప్రభుత్వ మనస్సాక్షి ఎక్కడికి పోయిందో ప్రధానమంత్రి నుండి నేను తెలుసుకోవాలనుకుంటున్నానని అన్నారు. ఇది జాతి హత్య అని పంజాబ్, హర్యానా హైకోర్టు వ్యాఖ్యానించింది. నిన్న హోంమంత్రి చాలా పెద్ద సమాధానం ఇచ్చారని.. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నప్పుడు మీ మనస్సాక్షి ఎక్కడికిపోయిందని ప్రశ్నించారు.