ఎంఐఎం పార్టీ(IMI Party) ఈసారి తీన్మార్‌ కొట్టబోతున్నదా? పరిస్థితులు చూస్తే అలాగే అనిపిస్తోంది. ఎంఐఎం పేరు చెప్పగానే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ లోక్‌సభ సీటు(Lok sabha Seat), ఏడు అసెంబ్లీ సీట్లు అనే చెప్పుకుంటున్నారు. గత మూడు దశాబ్దాలుగా హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలో ఎంఐఎం తిరుగులేని విజయాలు సాధిస్తూ వస్తోంది. చాలా మందికి ఎంఐఎం పార్టీ కేవలం హైదరాబాద్‌ లోక్‌సభ సీటును మాత్రమే గెల్చుకుందని అనుకుంటారు. మజ్లిస్‌కు రెండో లోక్‌సభ సీట్లు ఉన్నాయి. హైదరాబాద్‌ ఒకటికాగా, రెండోది మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌.

ఎంఐఎం పార్టీ(MIM Party) ఈసారి తీన్మార్‌ కొట్టబోతున్నదా? పరిస్థితులు చూస్తే అలాగే అనిపిస్తోంది. ఎంఐఎం పేరు చెప్పగానే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ లోక్‌సభ సీటు(Lok sabha Seat), ఏడు అసెంబ్లీ సీట్లు అనే చెప్పుకుంటున్నారు. గత మూడు దశాబ్దాలుగా హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలో ఎంఐఎం తిరుగులేని విజయాలు సాధిస్తూ వస్తోంది. చాలా మందికి ఎంఐఎం పార్టీ కేవలం హైదరాబాద్‌ లోక్‌సభ సీటును మాత్రమే గెల్చుకుందని అనుకుంటారు. మజ్లిస్‌కు రెండో లోక్‌సభ సీట్లు ఉన్నాయి. హైదరాబాద్‌ ఒకటికాగా, రెండోది మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌. మరికొన్ని రాష్ట్రాలలో మజ్లిస్‌కు శాసనసభ్యులు కూడా ఉన్నారు. మహారాష్ట్ర, బీహార్‌లలో(Bihar) ఆ పార్టీ శాసనసభ్యులు ఉన్నారు. గత ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌లో చెప్పుకోదగ్గ ఓట్లు సాధించిన ఎంఐఎం ఈ ఎన్నికలలో ఓట్ల సంఖ్యను గణనీయంగా పెంచుకోబోతున్నది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో(General Elections) ఇండియా కూటమి(INDIA Alliance) గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఉత్తరాదిలో నరేంద్రమోదీ(Narendra Modi) హవా పనిచేయడం లేదని అంటున్నారు. అంటే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. సంకీర్ణ ప్రభుత్వాలలో రెండు, మూడు ఎంపీ స్థానాలు ఉన్న పార్టీలు కూడా కీలకపాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో ఎంఐఎం మెజారిటీ స్థానాలు గెల్చుకోవాలనుకుంటోంది. ఉత్తరప్రదేశ్‌లో కొన్ని చిన్నపార్టీలతో కలిసి ఎంఐఎం పోటీ చేస్తున్నది. ఉత్తరప్రదేశ్‌లో మజ్లిస్‌ కూటమి ఆరు నుంచి ఏడు లోక్‌సభ స్థానాలు గెలవొచ్చనే మాట వినిపిస్తోంది. ఈ విషయం అలా ఉంచితే మజ్లిస్‌(Majlis) సొంతంగా మూడు లోక్‌సభ స్థానాలు గెల్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ ఎంతగా ప్రచారం చేసుకున్నా హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం మజ్లిస్‌కే దక్కుతుంది. ఎంఐఎం విజయంపైన ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. మెజారిటీ తగ్గితే తగ్గవచ్చు కానీ గెలవడం మాత్రం పక్కా అని అంటున్నారు. అలాగే మహారాష్ట్రంలోని ఔరంగాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని నిలబెట్టుకోబోతున్నది. మహారాష్ట్రలో నాలుగు పార్టీలో పడుతున్నాయి. షిండే వర్గం శివసేన బీజేపీ వైపు ఉంటే, ఉద్ధవ్‌ థాక్రేకు చెందిన శివసేన కాంగ్రెస్‌ కూటమిలో ఉంది. అలాగే ఎన్సీపీ కూడా! అజిత్‌ పవార్‌ ఎన్సీపీ బీజేపీ కూటమిలో ఉంటే, శరద్‌పవార్‌ ఎన్సీపీ కాంగ్రెస్‌ కూటమిలో ఉంది. ఇక ఔరంగాబాద్‌ విషయానికి వస్తే ఈ ప్రాంతంలోని కీలకనాయకుడు అశోక్‌ చౌహాన్‌ ఇటీవలే కాంగ్రెస్‌ను వదిలిపెట్టి బీజేపీలో చేరారు. అశోక్‌ చౌహాన్‌(ashok Chauhan) పార్టీలో లేనిలోటు కాంగ్రెస్‌లో(congress) కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆ పార్టీ క్యాడర్‌లో నిర్లిప్తత ఆవరించింది. ఈ నేపథ్యంలో ఔరంగాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని మజ్లిస్‌ నిలబెట్టుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బీహార్‌లో కూడా మజ్లిస్‌ బలపడుతోంది. గత ఎన్నికల్లో అయిదు అసెంబ్లీ స్థానాలోల మజ్లిస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. ఈసారి కిషన్‌గంజ్‌ లోక్‌సభ స్థానంపై మజ్లిస్‌ కన్నేసింది. గెలుపు కోసం చాలా కృషి చేసింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అత్తరులేమాన్‌కు కిషన్‌గంజ్‌ టికెట్‌ ఇచ్చింది. ఈయన గెలుపు కోసం అసదుద్దీన్‌ ఓవైసీ మూడు నాలుగు సార్లు అక్కడ ప్రచారం చేశారు. గ్రౌండ్‌ వర్క్‌ చేశారు. రాజకీయ వ్యూహకర్తను నియమించుకున్నారు. సోషల్‌ మీడియా సహకారం తీసుకున్నారు. మొత్తంగా ఇక్కడ్నుంచి ఎంఐఎం పార్టీ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌, ఔరంగాబాద్‌, కిషన్‌గంజ్‌లలో ఎంఐఎం విజయం సాధిస్తే మాత్రం ఆ పార్టీ ఢిల్లీలో చక్రం తిప్పవచ్చు. ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే మాత్రం మజ్లిస్‌ పంటపండినట్టే! కొన్ని సందర్భాలలో మూడు ఎంపీ సీట్లు కూడా కీలకం అవుతాయి. మజ్లిస్‌ కూడా ఈ రకమైన ఆశలే పెట్టుకుంది.

Updated On 27 May 2024 4:27 AM GMT
Ehatv

Ehatv

Next Story