Asaduddin Owaisi : మూడు నెలల కిందటే చెప్పా... ప్రభుత్వం పట్టించుకోలేదు
గూఢచర్య ఆరోపణలతో ఇండియన్ నేవీకి చెందిన ఎనిమిది మంది మాజీ అధికారులకు ఖతార్ కోర్టు మరణశిక్ష విధించడంపై ఏఐఎంఐఎం(AIMIM) అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) స్పందించారు. ఖతార్‌లో ఏడాదికి పైగా జైలులో మగ్గిపోతున్న నావికాదళ మాజీ అధికారుల సమస్యను ఆగస్టులో పార్లమెంట్‌లో ప్రస్తావించానని, ప్రధాని మోదీ(PM Narendra) ఈ విషయాన్ని అసలు పట్టించుకోలేదని ఒవైసీ(OYC) తెలిపారు. విశ్వగురుగా పేరు తెచ్చుకున్నాడని చెబుతున్న ప్రధాని మోదీ వారిని వెంటనే వెనక్కి తీసుకురావాలని ఒవైసీ డిమాండ్ చేశారు.
గూఢచర్య ఆరోపణలతో ఇండియన్ నేవీకి చెందిన ఎనిమిది మంది మాజీ అధికారులకు ఖతార్ కోర్టు మరణశిక్ష విధించడంపై ఏఐఎంఐఎం(AIMIM) అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) స్పందించారు. ఖతార్‌లో ఏడాదికి పైగా జైలులో మగ్గిపోతున్న నావికాదళ మాజీ అధికారుల సమస్యను ఆగస్టులో పార్లమెంట్‌లో ప్రస్తావించానని, ప్రధాని మోదీ(PM Narendra Modi) ఈ విషయాన్ని అసలు పట్టించుకోలేదని ఒవైసీ తెలిపారు. విశ్వగురుగా పేరు తెచ్చుకున్నాడని చెబుతున్న ప్రధాని మోదీ వారిని వెంటనే వెనక్కి తీసుకురావాలని ఒవైసీ డిమాండ్ చేశారు. ఇస్లామిక్ దేశాలు(Islamic Countries) తనను ఎంతగానో ప్రేమిస్తున్నాయని గొప్పలు చెప్పుకునే ప్రధాని కనీసం దీనిపైనైనా మాట్లాడాలని ఒవైసీ తెలిపారు. కాగా ఇజ్రాయెల్‌కు గూఢచారులుగా పనిచేస్తున్నారనే అనుమానంతో ఎనిమిది మంది భారత నావికాదళ మాజీ అధికారులకు ఖతార్ కోర్టు మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై భారత ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సాధ్యమయ్యే అన్ని చట్టపరమైన చర్యలను అన్వేషిస్తున్నట్లు ప్రకటించింది.