మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ప్రచారం చేయాల్సిన మంత్రి.. నేను బతికున్నంతవరకూ మద్య నిషేధం(Liquor Ban) జరగనివ్వనని వ్యాఖ్యానించిడం తీవ్రకలకలం రేపుతుంది. ఛత్తీస్‌గఢ్ ఎక్సైజ్ శాక(Chhattisgarh Excise Minister) మంత్రి, బస్తర్ ఇన్‌ఛార్జ్ మంత్రి కవాసీ లఖ్మా(Kawasi Lakhma) మద్య నిషేధంపై సంచలన ప్రకటన చేశారు. మద్య నిషేధానికి సంబంధించి మంత్రి మాట్లాడుతూ.. తాను జీవించి ఉన్నంత వరకు బస్తర్‌లో మద్య నిషేధం ఉండదని అన్నారు. మితంగా మద్యం సేవించడం వల్ల శరీరానికి ఎలాంటి హాని జరగదని, […]
మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ప్రచారం చేయాల్సిన మంత్రి.. నేను బతికున్నంతవరకూ మద్య నిషేధం(Liquor Ban) జరగనివ్వనని వ్యాఖ్యానించిడం తీవ్రకలకలం రేపుతుంది. ఛత్తీస్‌గఢ్ ఎక్సైజ్ శాక(Chhattisgarh Excise Minister) మంత్రి, బస్తర్ ఇన్‌ఛార్జ్ మంత్రి కవాసీ లఖ్మా(Kawasi Lakhma) మద్య నిషేధంపై సంచలన ప్రకటన చేశారు. మద్య నిషేధానికి సంబంధించి మంత్రి మాట్లాడుతూ.. తాను జీవించి ఉన్నంత వరకు బస్తర్‌లో మద్య నిషేధం ఉండదని అన్నారు. మితంగా మద్యం సేవించడం వల్ల శరీరానికి ఎలాంటి హాని జరగదని, అతిగా సేవిస్తే మాత్రం ఆరోగ్యానికి హానికరం అన్నారు. కవాసీ లఖ్మా శనివారం జగదల్‌పూర్‌లోని బస్తర్‌లో పర్యటించిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. తాజా ప్రకటనతో ఆయన పేరు సోషల్ మీడియా(social Media)లో వైరల్ అవుతుంది.
మద్యపాన నిషేధంపై ఆయన్ను ప్రశ్నించగా.. ఇక్కడి ప్రజలకు మద్యం తాగే స్టైల్ తెలియదని అన్నారు. మద్యం తాగితే మనుషులు చనిపోరని.. అతిగా తాగితే చనిపోతారని అన్నారు. వైన్ ఔషధంగా సేవించాలని, అది మనిషిని దృఢంగా మారుస్తుందని చెప్పారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కవాసీ లఖ్మా గత రెండు రోజులుగా బస్తర్ డివిజన్ కేంద్రమైన జగదల్‌పూర్‌లో పర్యటిస్తున్నారు. ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) బస్తర్ పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆయన అక్కడ బసచేస్తున్నట్లు తెలుస్తోంది.
వ్యవసాయ కూలీలు, అధిక బరువులు మోసేవారు సేదతీరేందుకు మద్యం సేవిస్తున్నారని మంత్రి ఉదాహరణగా వివరించారు. ఇంతమంది మద్యం సేవించకుంటే పనిలేకుండా పోతుందన్నారు. విదేశాల్లో 100 శాతం మంది మద్యం సేవిస్తుంటే బస్తర్‌లో 90 శాతం మంది మద్యం సేవిస్తున్నారని చెప్పారు. బస్తర్‌లో మద్య నిషేధం ఎప్పటికీ జరగదని, ఇక్కడ సంస్కృతిలో ప్రతి కార్యక్రమంలో మద్యాన్ని ఉపయోగిస్తారని ఆయన అన్నారు. గిరిజనులకు మద్యం ఎంతో అవసరమన్నారు.