నేషనల్‌ కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి క్లైడ్‌ క్యాస్ట్రో అన్నట్టుగానే మహారాష్ట్రలో కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారా? ఏక్‌నాథ్‌ షిండే సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నారా? బీజేపీ అధినాయకత్వం ఆదేశాలకు తలొగ్గుతున్నారా? ప్రస్తుతం మహారాష్ట్రలో ఈ ప్రశ్నలు హాట్‌టాపిక్‌గా మారాయి. సీఎం పదవి నుంచి తప్పుకోవాలని బీజేపీ హుకుం జారీ చేసిందనీ, ఈ కారణంతోనే షిండే మనస్తాపానికి గురై మూడు రోజులు సెలవుల్లో వెళ్లారని క్యాస్ట్రో చేసిన ట్వీట్‌ సంచలనం రేపుతోంది.

నేషనల్‌ కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి క్లైడ్‌ క్యాస్ట్రో (Quid Pro Co) అన్నట్టుగానే మహారాష్ట్రలో కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారా? ఏక్‌నాథ్‌ షిండే (Eknath Shinde) సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నారా? బీజేపీ అధినాయకత్వం ఆదేశాలకు తలొగ్గుతున్నారా? ప్రస్తుతం మహారాష్ట్రలో ఈ ప్రశ్నలు హాట్‌టాపిక్‌గా మారాయి. సీఎం పదవి నుంచి తప్పుకోవాలని బీజేపీ (BJP) హుకుం జారీ చేసిందనీ, ఈ కారణంతోనే షిండే మనస్తాపానికి గురై మూడు రోజులు సెలవుల్లో వెళ్లారని క్యాస్ట్రో చేసిన ట్వీట్‌ సంచలనం రేపుతోంది. సీఎం షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లు తమ తమ పదవులను మార్చుకోవాలని బీజేపీ చెప్పినట్టుగా క్యాస్ట్రో ట్వీట్ చేశారు. త్వరలో ఫడ్నవీస్‌ (Devendra Fadnavis) ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారని, షిండే డిప్యూటీ సీఎం అవుతారని అన్నారాయన..

మీడియా వర్గాలు క్లైడ్‌ క్యాస్ట్రోకు ఈ వివరాలు అందించారట! దీనిపై ఢిల్లీలో ఓ సమావేశం కూడా జరిగిందని, బీజేపీ (BJP) పదవి మార్చుకోమని తనకు చెప్పడం ఇష్టం లేకే షిండే మూడు రోజలు సెలవు పెట్టి వెళ్లారట!
శివసేన (Shiv Sena) (ఉద్ధవ్‌ వర్గం) నేత సంజయ్‌ రౌత్‌ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వానికి మరణశాసనం రెడీ అయిందని సంజయ్‌ రౌత్‌ కామెంట్ చేశారు. మరో పక్షం రోజుల్లో ప్రభుత్వం కుప్పకూలిపోవడం ఖాయమన్నారు. ఇప్పుడు తేలాల్సింది మరణశాసనంపై సంతకం ఎవరు చేస్తారన్నది అని రౌత్‌ అన్నారు. ఎన్‌సీపీ కూడా సీఎం మార్పుపై కీలక వ్యాఖ్యలు చేయడం మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి.
గత ఏడాది కొంతమంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు, బీజేపీతో కలిసి సీఎం ఉద్దవ్‌ థాక్రేను గద్దె దింపారు ఏక్‌నాథ్‌ షిండే.. ఇందులో బీజేపీ ప్రధానపాత్ర పోషించింది. తర్వాత బీజేపీ అండదండలతో సీఎం బాధ్యతలు చేపట్టారు. షిండేను బీజేపీ బెదిరించిందని, తమవైపు రాకపోతే కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపించి అరెప్ట్‌ చేయిస్తామని బ్లాక్‌ మెయిల్‌ చేసిందని ఉద్ధవ్‌ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే అన్నారు... బీజేపీతో కలిసి వెళ్లడానికి ముందు షిండే తమ ఇంటికి వచ్చి ఏడ్చారని ఆదిత్య థాక్రే చెప్పుకొచ్చారు.

Updated On 25 April 2023 7:36 AM GMT
Ehatv

Ehatv

Next Story