ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం ఆయన ఇంట్లో సోదాలు జరిపిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు కేజ్రీవాల్ ఈడీ చర్యలు అడ్డుకోవాలని ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేయగా చుక్కెదురైంది. దీంతో గంటల వ్యవధిలోనే కేజ్రీవాల్ నివాసానికి సెర్చ్ వారెంట్‌తో వెళ్లిన అధికారులు.. కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకున్నారు.
సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌తో ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈడీ అధికారుల వైఖరిని నిరసిస్తూ కేజ్రీవాల్ ఇంటి వద్ద ఆప్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున ఆప్ కార్యకర్తలు కేజ్రీవాల్ నివాసానికి వస్తుండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలావుంటే.. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడం వెనుక బీజేపీ కుట్ర ఉందంటూ ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ అయినా కూడా ఆయనే సీఎంగా కొనసాగుతారని ఢిల్లీ మంత్రి అతిషీ వెల్లడించారు.