ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Admi Party) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఇండియా కూటమికి(India Alliance) పెద్ద షాకిచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని(Punjab) అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Admi Party) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఇండియా కూటమికి(India Alliance) పెద్ద షాకిచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని(Punjab) అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. పంజాబ్‌లో ఉన్న 13 లోక్‌సభ(Lok sabha), చండీగడ్‌లోని ఒక లోక్‌సభ స్థానానికి పోటీ చేయనున్నామని చెప్పారు. త్వరలో అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని తెలిపారు. బీజేపీకి(BJP) వ్యతిరేకంగా దేశంలోని ప్రధాన ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. అయితే సీట్ల సర్దుబాటు విషయంలో పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. పంజాబ్‌లో కాంగ్రెస్‌తో(Congress) సీట్ల షేరింగ్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ రెడీగా లేదు.
ఇండియా కూటమి నుంచి ఇప్పటికే బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ(Mamatha Banerjee), బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్(Nitish kumar) బయటకు వచ్చారు. బెంగాల్‌లో సీట్ల పంపకాలలో కాంగ్రెస్‌తో విభేదాలు వచ్చినందుకు మమతా బెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40 సీట్ల కంటే ఎక్కువ రావని కామెంట్ కూడా చేశారు. ఇక బీహార్‌లో అయితే నితీష్ కుమార్ ఏకంగా బీజేపీతో చేతులు కలిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరిచారు.