ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తనపై ఎలాంటి శిక్షార్హమైన చర్యలు తీసుకోవద్దని డిమాండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో తాజా పిటిషన్ దాఖలు చేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తనపై ఎలాంటి శిక్షార్హమైన చర్యలు తీసుకోవద్దని డిమాండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో తాజా పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సురేష్ కుమార్ కైత్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ ఉదయం ఈ కేసును విచారించనుంది. ఎక్సైజ్ కేసులో ఈడీ ఆయనకు ఇప్పటి వరకు 9 సమన్లు జారీ చేసింది. నిన్న ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కేసు విచారణ సందర్భంగా ఆయన తరపు న్యాయవాదులు మాట్లాడుతూ.. తమను ఈడీ అరెస్టు చేస్తుందన్న భయం ఉందని.. తమకు రక్షణ కల్పిస్తే తాము హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఇదిలావుంటే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నిందితుల్లో ఒకరైన అభిషేక్ బోయినపల్లికి సుప్రీంకోర్టు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తన భార్య అనారోగ్య కారణంగా బెయిల్ కోసం అభిషేక్ బోయినపల్లి పిటిషన్ వేయగా.. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.