చదువు పూర్తయ్యాక మంచి ఉద్యోగం(Job) కోసం వెతుకులాట మొదలవుతుంది. మంచి రెజ్యూమ్‌లు(Resume) తయారు చేసుకుని ఆఫీసుల చుట్టూ తిరగడం పరిపాటే!

చదువు పూర్తయ్యాక మంచి ఉద్యోగం(Job) కోసం వెతుకులాట మొదలవుతుంది. మంచి రెజ్యూమ్‌లు(Resume) తయారు చేసుకుని ఆఫీసుల చుట్టూ తిరగడం పరిపాటే! క్యాంపస్‌ ఇంటర్వ్యూలలో(Campus Interview) జాబ్‌ కొట్టేసిన వారి సంగతి పక్కన పెడితే మిగతా వారే ఉద్యోగం కోసం కాసింత కష్టపడాల్సి వస్తుంది. కంపెనీ వారు ఇంప్రెస్‌ అవ్వాలంటే ముందు రెజ్యూమ్‌ బాగుండాలి. క్వాలిటీల గురించి ఎకరువు పెడుతూ చక్కగా తయారుచేసుకోవాలి. ఓ వ్యక్తి మాత్రం తాను సంబంధిత ఉద్యోగానికి ఎలా అర్హుడినో రెజ్యూమ్‌లో చక్కగా చెబుతూనే తన ప్రేమ గురించి కూడా అందులో ప్రస్తావించాడు. తనకు ఈ ఉద్యోగం రాకపోతే తన చిన్నప్పటి గర్ల్‌ ఫ్రెండ్‌ను(Girlfriend) పెళ్లి చేసుకోలేనంటూ ప్రాధేయపడ్డాడు. కంపెనీవారు ఆ వ్యక్తని ఏం అడిగారంటే ఈ ఉద్యోగానికి మీరు అర్హులు అని ఎందుకు అనుకుంటున్నారు? అని.. దానికి అతడు జవాబిస్తూ ' నాకు ఈ పొజిష‌న్‌కి కావాల్సిన అన్ని నైపుణ్య‌లు నాకు ఉన్నాయి. నేను దీనికి వంద శాతం ప‌ర్ఫెక్ట్ అని అనిపిస్తోంది’ అని చెబుతూ 'ఈ ఉద్యోగం నాకు రాక‌పోతే నేను నా చిన్న‌నాటి స్నేహితురాల‌ని పెళ్లి చేసుకోలేను. ఎందుకంటే వాళ్ల నాన్న నాకు ఉద్యోగం లేక‌పోతే త‌న కూతురిని ఇచ్చి పెళ్లి చేయ‌ను అంటున్నాడు’ అంటూ వేడుకున్నాడు. అర్వా హెల్త్ ఫౌండర్‌, సీఈవో డిపాలీ బజాజ్ ఇటీవల ఒక అభ్యర్థి ఉద్యోగ దరఖాస్తును స్క్రీన్‌షాట్‌ తీసి ఎక్స్‌ (ట్విట్టర్‌)లో షేర్‌ చేశారు. గంటల్లోనే ఇది వైరల్‌ అయ్యింది. ఫైరింగ్‌ కెన్‌ మీ ఫన్‌ టూ అనే క్యాప్షన్‌ను ఆమె జత చేశారు. ఇది చూసిన నెటిజన్లలో కొందరు అతడికి సపోర్ట్‌గా నిలిచారు. నిజాయితీగా ఉన్న విషయం చెప్పినందుకైనా అతడికి ఉద్యోగం ఇవ్వాలని కొందరు కామెంట్‌ చేశారు.

Eha Tv

Eha Tv

Next Story