దేశ వ్యాప్తంగా ఇప్పటికి ప్రకంపనలు సృష్టిస్తున్న లిక్కర్ స్కాం కేసులో ఇంకా అరెస్ట్ ల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు లేటేస్ట్ గా ఈ కేసులో ఈడీ మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు లిక్కర్ స్కాంలో 11 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన అధికారులు తీహార్ జైలుకు తరలించారు. ప్రస్తుతం మనీష్ సిసోడియా జ్యుడిషియల్ […]

దేశ వ్యాప్తంగా ఇప్పటికి ప్రకంపనలు సృష్టిస్తున్న లిక్కర్ స్కాం కేసులో ఇంకా అరెస్ట్ ల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు లేటేస్ట్ గా ఈ కేసులో ఈడీ మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు లిక్కర్ స్కాంలో 11 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన అధికారులు తీహార్ జైలుకు తరలించారు. ప్రస్తుతం మనీష్ సిసోడియా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు . ఇవాళ తీహార్ జైల్లోనే మనీష్ సిసోడియాను అధికారులు విచారించనున్నారు. అయితే ఈ విచారణలో అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు. దానికి సిసోడియా ఎలాంటి సమాధానాలు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు ఈ కేసులో అరబిందో శరత్ చంద్రారెడ్డి తీహార్ జైల్లో ఉండగా..అయన బెయిల్ పిటీషన్ ను సీబీఐ స్పెషల్ కోర్టు నిరాకరించింది. అయితే శరత్ చంద్రారెడ్డి మనీలాండరింగ్ ను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ బెయిల్ పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఇవాళ విచారణ జరపనుంది.

లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్‌యిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ఇప్పటికే తన మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఆయన అండర్‌లో ఆర్థికశాఖ సహా 18 పోర్ట్‌ ఫోలియోలున్నాయి. డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న సిసోడియా అన్ని పదవులకు రాజీనామా చేశారు అటు గతేడాది మనీలాండరింగ్‌ కేసులో అరెస్ట్‌యిన సత్యేంద్ర జైన్‌ కూడా రాజీనామా చేశారు. ఈ ఇద్దరి రాజీనామాలను సీఎం కేజ్రీవాల్ ఆమోదించారు. ఇప్పుడు వారి స్థానాల్లో కొత్త వారు మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Updated On 7 March 2023 1:27 AM GMT
Ehatv

Ehatv

Next Story