మణిపూర్‌లో(Manipur) హింస ఆగ‌డం లేదు. మణిపూర్‌లోని కాంటో సంబల్(Canto Sambal), చింగ్‌మాంగ్(chingmang) గ్రామాల్లో నిన్న రాత్రి భారీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక జవాన్‌(Army) కూడా గాయపడ్డాడు.

మణిపూర్‌లో(Manipur) హింస ఆగ‌డం లేదు. మణిపూర్‌లోని కాంటో సంబల్(Canto Sambal), చింగ్‌మాంగ్(chingmang) గ్రామాల్లో నిన్న రాత్రి భారీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక జవాన్‌(Army) కూడా గాయపడ్డాడు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించారు. కంటో సంబల్‌లోని ఐదు ఇళ్లకు ఉగ్రవాదులు నిప్పు పెట్టారు.

ఆదివారం అర్థరాత్రి సాయుధ దుండగులు కాంటో సబల్ నుండి చింగ్‌మాంగ్ గ్రామం వైపు ఎటువంటి కారణం లేకుండా కాల్పులు(Shootout) జరిపారని సైన్యం తెలిపింది. సామాన్యుల భద్రత నేప‌థ్యంలో సైన్యం ప్రతీకార చ‌ర్య‌కు దిగింది. ఈ సందర్భంగా కాల్పుల్లో ఒక జవాన్‌ కూడా గాయపడ్డాడు. అతన్ని లిమాఖోంగ్ సైనిక ఆసుపత్రికి తరలించాం. ప్రస్తుతం జవాన్ పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొంది.

స్థానిక నివాసి మాట్లాడుతూ.. రాత్రి 12 గంటల సమయంలో, అనుమానిత కుకీ ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాంటో సబల్‌పై కాల్పులు ప్రారంభించారని చెప్పారు. ఇది మాత్రమే కాదు, ఈ ఉగ్రమూకలు ఐదు ఇళ్లకు కూడా నిప్పు పెట్టారు. నగరంలో పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించినట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ రిటైర్డ్‌ అధికారి అముతోయ్‌ తెలిపారు.

ఒక నెల క్రితం మణిపూర్‌లో చెలరేగిన మెయిటీ, కుకీ వర్గాల ప్రజల మధ్య జరిగిన జాతి హింసలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వదంతులు వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. 11 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిషేధించింది. అయినా రాష్ట్రంలో ప‌రిస్థితులు అదుపులోకి రావ‌ట్లేదు.

Updated On 19 Jun 2023 12:15 AM GMT
Ehatv

Ehatv

Next Story