కేరళ(Kerala)లోని త్రిసూర్ పూరం(Thrissur Pooram)లో అత్యద్భుతంగా, కన్నుల పండుగగా జరిగింది. ఆ మహోత్సవాన్ని తిలకించడానికి లక్షలాది మంది వచ్చారు. త్రిసూర్ జనసంద్రంతో నిండిపోయింది. తిరువంబాడి, పరమేక్కావు దేవస్థానాల ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శనలో తిరువంబాడి దేవస్థానం ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ(Lionel Messi) కటౌట్‌ను ఎత్తుకోవడంతో ప్రేక్షకుల ఉత్సాహం రెట్టింపు అయ్యింది.
కేరళ(Kerala)లోని త్రిసూర్ పూరం(Thrissur Pooram)లో అత్యద్భుతంగా, కన్నుల పండుగగా జరిగింది. ఆ మహోత్సవాన్ని తిలకించడానికి లక్షలాది మంది వచ్చారు. త్రిసూర్ జనసంద్రంతో నిండిపోయింది. తిరువంబాడి, పరమేక్కావు దేవస్థానాల ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శనలో తిరువంబాడి దేవస్థానం ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ(Lionel Messi) కటౌట్‌ను ఎత్తుకోవడంతో ప్రేక్షకుల ఉత్సాహం రెట్టింపు అయ్యింది. ఓ క్రీడాకారుడికి పూరంలో ఇలాంటి గౌరవం ఇంతకు మునుపెన్నడూ జరగలేదు. కేరళవాసులకు ఫుట్‌బాల్‌పై ఉన్న మక్కువకు ఇది నిదర్శనం.
తిరువంబాడి దేవస్థానం తరఫున 15 ఏనుగులు, పరమేక్కావు దేవస్థానం తరఫున 15 ఏనుగులు ఇరువైపులా గంభీరంగా నిలుచుకున్నాయి. దాదాపు రెండు గంటల పాటు బ్రహ్మండమైన ప్రదర్శన జరిగింది. ఏనుగుల నుదిటి మీద అలంకరించే బంగారు ఆభరణాలను నెట్టిపట్టం అంటారు. వీపుపైన పట్టుపీతాంబరాలను అలంకరించుకున్నాయి. ఏనుగుల మీద నిలబడిన ఆటగాళ్లు రంగు రంగుల గొడుగులతో చేసే విన్యాసాలు చూపు తిప్పుకోనివ్వలేదు. వీటిని కుడమట్టం అంటారు. లక్షలాది మంది చేసే కోలాహలం.. వాయిద్యాల హోరు.. బాణాసంచా చప్పుళ్ల మధ్య మావటి ఆజ్ఞకు కట్టుబడి గంటల తరబడి ఏనుగులు అలా నిల్చుకోవడమన్నది అద్భుతం. మహాద్భుతం. మెస్సీతో ఉన్న పారాసోల్ డిస్‌ప్లేను తిరువంబాడి దేవస్థానం ప్రదర్శించింది. అది కూడా ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. ఈలలు వేశారు. కేరళలో ఫుట్‌బాల్‌కు అమితమైన క్రేజ్ ఉంటుంది. లాస్టియర్ జరిగిన ప్రపంచకప్ సందర్భంగా ఎక్కడ చూసినా ఫుట్‌బాల్ ప్లేయర్ల కటౌట్లే దర్శనమిచ్చాయక్కడ.