ది కేరళ స్టోరీ(The Kerala Story) సినిమాతో విద్వేషాలు రగిల్చి ఓట్లు దండుకోవాలనుకుంటున్న పార్టీలు కేరళ ఆత్మను పట్టుకోలేకపోతున్నారు. అక్కడ విద్వేషాలకు తావుండన్న సంగతి వారికి తెలియదు కాబోలు. మత సామరస్యాన్ని ప్రతిఫలించే ఎన్నో ఘటనలను చూశాం. ఇప్పుడు సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్(A. R. Rahman) షేర్ చేసిన వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ది కేరళ స్టోరీ(The Kerala Story) సినిమాతో విద్వేషాలు రగిల్చి ఓట్లు దండుకోవాలనుకుంటున్న పార్టీలు కేరళ ఆత్మను పట్టుకోలేకపోతున్నారు. అక్కడ విద్వేషాలకు తావుండన్న సంగతి వారికి తెలియదు కాబోలు. మత సామరస్యాన్ని ప్రతిఫలించే ఎన్నో ఘటనలను చూశాం. ఇప్పుడు సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్(A. R. Rahman) షేర్ చేసిన వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేరళలోని చేరువల్లి ముస్లిం జమాత్ మసీదులో హిందువులైన శరత్, అంజు వివాహం హిందూ పురోహితుడి చేతుల మీదుగా హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. వేద మంత్రాలు, బాజాభజంత్రీల మధ్య వధువుకు తాళి కట్టాడు వరుడు. నిర్వాహకులు తమ మసీదులో హిందు జంటకు పెళ్లి చేయడమే కాదు, వధువుకు పది తులాల బంగారం, దంపతులిద్దరికీ 20 లక్షల రూపాయల ఆర్ధిక సాయం కూడా చేశారు. వెయ్యి మందికి పైగా పెళ్లి భోజనాలు పెట్టారు. ఇది మూడేళ్ల కిందట జరిగిన సంఘటనే అయినా ఇది ఇప్పుడు కూడా రిలవెంటే! వీడియోను షేర్ చేసిన రెహమాన్ 'ప్రేమ బేషరతుగా, స్వస్థతతో ఉండాలని ట్వీట్ చేశారు.