సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌(AR Rehman) కీర్తి ప్రతిష్టలు ఎల్లలు దాటాయి. మన దేశానికి సంగీతంలో మొదటిసారి ఆస్కార్‌ను(Oscar) అందించిన ఘనుడాయన! హీరోను చూసో, దర్శకుడిని చూసో సినిమాలకు వెళ్లడం పరిపాటే కానీ సంగీత దర్శకుడి పేరు చూసి థియేటర్లకు వెళ్లడం రెహమాన్‌తోనే మొదలయ్యింది. ఇప్పుడాయనకు అవకాశాలు తగ్గి ఉండవచ్చు కానీ ఒకప్పుడు దక్షిణాదిలోనూ, బాలీవుడ్‌లోనూ ఆయనదే హవా! కేవలం ఆయన పాటలు, బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్‌ కోసమే ప్రేక్షకులు థియేటర్‌లకు వెళ్లారు.

సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌(AR Rehman) కీర్తి ప్రతిష్టలు ఎల్లలు దాటాయి. మన దేశానికి సంగీతంలో మొదటిసారి ఆస్కార్‌ను(Oscar) అందించిన ఘనుడాయన! హీరోను చూసో, దర్శకుడిని చూసో సినిమాలకు వెళ్లడం పరిపాటే కానీ సంగీత దర్శకుడి పేరు చూసి థియేటర్లకు వెళ్లడం రెహమాన్‌తోనే మొదలయ్యింది. ఇప్పుడాయనకు అవకాశాలు తగ్గి ఉండవచ్చు కానీ ఒకప్పుడు దక్షిణాదిలోనూ, బాలీవుడ్‌లోనూ ఆయనదే హవా! కేవలం ఆయన పాటలు, బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్‌ కోసమే ప్రేక్షకులు థియేటర్‌లకు వెళ్లారు. ఆయన లైవ్‌ కాన్సెర్ట్‌(Live Concert) చేస్తున్నారంటే జనం కిక్కిరిసిపోయేవారు. టికెట్లు దొరికేవి కాదు. కానీ లేటెస్ట్‌గా జరిగిన ఓ కాన్సెర్ట్ మాత్ర రెహమాన్‌ ఫ్యాన్స్‌ను పూర్తిగా నిరాశపర్చింది. బాధ కూడా పెట్టింది. చెన్నై(Chennai) నగరంలో మురుక్కమ్‌ నెంజన్‌ అనే పేరుతో రెహమాన్‌ ఓ సంగీత కచేరిని ఏర్పాటు చేశారు. చెన్నైలో రెహమాన్‌ సంగీత కచేరి అంటే మామూలుగా ఉండదు కదా! ప్రముఖ ఆర్గనైజర్‌ కంపెనీ ఏవీటీసీ(AVTC) ఆధ్వర్యంలో ఈ కాన్సెర్ట్ జరిగింది. టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఆదివారం ఇండియా-పాకిస్తాన్‌(India-pakistan) మ్యాచ్‌ ఉన్నా సరే.. అభిమానులు దాన్ని లెక్క చేయకుండా రెహమాన్‌ సంగీత కచేరి టికెట్లు కొన్నారు. అయితే టిక్కెట్‌లు కొన్నవాళ్లలో చాలా మందికి అక్కడ సీట్లు లేవు. అంటే సీటింగ్‌ కెపాసిటీ కంటే ఎక్కువ సంఖ్యలో టికెట్లు అమ్మారన్నమాట! దాంతో సంగీత కచేరి చూసేందుకు, రహమాన్‌ పాటలను ఎంజాయ్‌ చేసేందుకు వచ్చిన వందలాది మందికి కూర్చోడానికి కుర్చీలు కూడా లేవు. దాంతో వారు ఆగ్రహంతో ఊగిపోయారు. వేలకు వేలు ఖర్చు పెట్టుకుని వస్తే ఇలా చేస్తారా అంటూ నిర్వాహకులపై మండిపడ్డారు. లోపల ఉన్నవారు కూడా కచేరిని ఎంజాయ్‌ చేయలేకపోయారు. సౌండ్‌ సిస్టమ్‌ అస్సలు బాగోలేదు. వెనకాల కూర్చున్న వారికి అసలు పాటలే వినిపించలేదు. దాంతో కాన్సర్ట్‌ను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ప్రస్తుతం తమిళనాడులో ఇదే టాపిక్‌ నడుస్తోంది. రెహమాన్‌ ఫ్యాన్స్‌ కోపం ఇంకా చల్లారలేదు. ఎన్నో లైవ్‌ కాన్సెర్ట్‌లకు వెళ్లాం కానీ ఇలాంటి సంఘటనలు ఎక్కడా జరగలేదని, ఇదే మొదటిసారి అని అంటున్నారు. అంతేనా స్కామ్‌2023(Scam 2023) అని ట్విట్టర్‌లో(Twitter)పెద్ద మొత్తంలో ట్రెండింగ్‌ చేస్తున్నారు. చెన్నై పనియుర్‌ ప్రాంతంలో ఉన్న ఆదిత్యరామ్‌ ప్యాలెస్‌లో ఈ వేడుక జరిగింది. దీనికి సుమారు 50 వేల మంది వచ్చారు. వారికి సరిపడా వసతులు కల్పించడంలో ఏవీటీసీ నిర్వాహకులు పూర్తిగా విఫలం అయ్యారు.

Updated On 12 Sep 2023 12:10 AM GMT
Ehatv

Ehatv

Next Story