సార్వత్రిక ఎన్నికలు(General Elections) సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల అధికారులు కీలక ప్రకటన చేశారు. పోస్టల్ బ్యాలెట్(Postal ballet) కోసం ఏప్రిల్ 15వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ పార్లమెంట్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఉద్యోగులకు సూచించారు.
సార్వత్రిక ఎన్నికలు(General Elections) సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల అధికారులు కీలక ప్రకటన చేశారు. పోస్టల్ బ్యాలెట్(Postal ballot) కోసం ఏప్రిల్ 15వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ పార్లమెంట్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఉద్యోగులకు సూచించారు. జీహెచ్‌ఎంసీ(GHMC) కార్యాలయం లోని పన్వార్ హాల్‌లో ఎసెన్షియల్ సర్వీసెస్ హెచ్‌ఓడీ లతో పోస్టల్ బ్యాలెట్‌పై సమావేశం నిర్వహించారు. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ రైల్వేస్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, దూరదర్శన్, ఆలిండియా రేడియో, విద్యుత్ శాఖ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ, రాష్ట్ర రవాణా సంస్థ, ఆహారం, పౌర సరఫరాల శాఖ, ఎస్‌ఎన్‌ఎల్, అగ్నిమాపక సేవ ఉద్యోగులు, పోల్ డే కవరేజ్ కోసం ఈసీఐ ద్వారా అధికారం పొందిన మీడియా వ్యక్తులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే సౌకర్యం కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. ఉద్యోగులు ఫారం-12డి నింపి సంబంధిత నోడల్ అధికారుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, వాటిని ఏప్రిల్ 15 లోగా సమర్పించాలన్నారు.