పండగంటే ఉత్సవాలు, ఊరేగింపులు, కొత్త దుస్తులు, ఆటపాటలు, పిండివంటలు, దైవదర్శనాలు, సమూహ సంబరాలు. పండుగను జరుపుకునే పద్ధతిలో తేడా ఉంటుందేమో కానీ మిగతావన్నీ సేమ్‌ టు సేమ్‌. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే శుక్రవారం తమిళుల కొత్త సంవత్సరం. సంవత్సరారంభాన్ని వారు పుత్తాండుగా జరుపుకుంటారు. ఎప్పుడూ తమిళుల పుత్తాండు నాడే మలయాళీల విషు (vishu)పండుగ కూడా వస్తుంది..ఈసారి మాత్రం విషు శనివారం వచ్చింది. దేశంలో చాలా చోట్ల శుక్రవారం కొత్త సంవత్సర వేడుకలు జరగనున్నాయి.

పండగంటే ఉత్సవాలు, ఊరేగింపులు, కొత్త దుస్తులు, ఆటపాటలు, పిండివంటలు, దైవదర్శనాలు, సమూహ సంబరాలు. పండుగను జరుపుకునే పద్ధతిలో తేడా ఉంటుందేమో కానీ మిగతావన్నీ సేమ్‌ టు సేమ్‌. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే శుక్రవారం తమిళుల కొత్త సంవత్సరం. సంవత్సరారంభాన్ని వారు పుత్తాండుగా జరుపుకుంటారు. ఎప్పుడూ తమిళుల పుత్తాండు నాడే మలయాళీల విషు (vishu)పండుగ కూడా వస్తుంది..ఈసారి మాత్రం విషు శనివారం వచ్చింది. దేశంలో చాలా చోట్ల శుక్రవారం కొత్త సంవత్సర వేడుకలు జరగనున్నాయి.

తమిళనాడు(tamilnadu)లో జరిగే పుత్తాండు (Puthandu) గురించి క్లుప్తంగా తెలుసుకుందాం!పుత్తాండు (Puthandu)అంటేనే కొత్త సంవత్సరం.. దీన్ని వరుడ పిరాప్పుగా (varuda pirappu) కూడా పిలుచుకుంటారు. తమిళ ప్రజలు వేల సంవత్సరాల నుంచి ఇదే రోజున నూతన సంవత్సరారంభాన్ని జరుపుకుంటున్నారన్నది చారిత్రక ఆధారం! ఈ ఏడాది ఈ పండుగను 14న జరుపుకుంటున్నారు. మధ్యలో అంటే 2008లో డీఎంకే (DMK) ప్రభుత్వం గడబిడ చేసింది.. ముఖ్యమంత్రి కరుణానిధి (Karunanidhi) ఇది ఆర్యుల పండగంటూ సంక్రాంతి సమయాన్నే కొత్త సంవత్సర ఆరంభంగా భావించాలని చట్టం చేశారు. ఏప్రిల్‌లో వచ్చే పుత్తాండును చిత్తిరై తిరునాళ్‌గా (chithirai thiruvizha) జరుపుకోవాలని ఆదేశించారు.. అనాదిగా వస్తున్న సంప్రదాయాలను చట్టాలు నిరోధించలేవు కాబట్టే తమిళ ప్రజలు ప్రభుత్వ ప్రకటనను తేలిగ్గా తీసుకున్నారు. పుత్తాండునే ఉగాదిగా జరుపుకుంటున్నారు. తర్వాత వచ్చిన జయలలిత (Jayalalitha)నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం చట్టాన్ని మార్చేసింది.
ఒక్క ఉగాది పచ్చడి అక్కడ ఉండదు కానీ పండుగ వైభవమంతా ఉంటుంది. పంచాంగ శ్రవణాలు. పిండి వంటలు. విందు భోజనాలు మామూలే! కొన్ని చోట్ల ఎడ్ల పందాలు కూడా జరుగుతాయి.

ఓ పెద్ద పళ్లెంలో మామిడి, అరటి, పనసపండ్లను పెడతారు. తమలపాకు, వక్క, బియ్యం, బంగారం వెండి ఆభరణాలు, నగదు, పూలు, అద్దం వీటన్నింటినీ ఆ పళ్లెంలో చక్కగా అమరుస్తారు. పండుగ రోజు పొద్దున్నే నిద్రలేచి మొదట దైవదర్శనం చేసుకున్న తర్వాత వీటి దర్శనాన్ని చేసుకుంటారు. సంపద వృద్ధికి ఇది సూచికన్నది వారి నమ్మకం. దీన్ని కన్ని అంటారు. అంటే శుభ దృష్టి అన్నమాట! దక్షిణ తమిళనాడులో ఇదే పండుగను చిత్తిరై విషుగా జరుపుకుంటారు. ఇంటినంతా చక్కగా అలంకరించుకుంటారు. ఇంటి ముందు రంగవల్లికలను తీర్చి దిద్దుతారు. ముగ్గు మధ్యలో కుట్టివిలకు (kuthu vilakku) అని ఓ దీపాన్ని వెలిగిస్తారు. ఆ వెలుగులో చెడు అనే చీకటి తొలగిపోవాలని ప్రార్థిస్తారు. కొత్త ఏడాదిని పురస్కరించుకుని పిల్లలకు పెద్దలు కొంత నగదును కానుకగా ఇస్తారు. దీన్ని కై విశేషమ్‌ అంటారు. పండుగ రోజున కుంభకోణం దగ్గర తిరువాడమరుదూర్‌లో ఎడ్ల బండ్ల ఫెస్టివల్‌ జరుగుతుంది.. కొన్ని చోట్ల ఎడ్ల పందేలు కూడా జరుగుతాయి.. శ్రీలంకలో (Srilanka)ఉన్న తమిళులు కూడా ఇదే రోజున నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటారు.. ఆ రోజున అక్కడ సెలవుదినం.. వన మూలికలతో చేసిన తైలాన్ని నీటిలో కలుపుతారు.. ఆ నీటితో అభ్యంగన స్నానం ఆచరిస్తారు. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచి చేస్తుందన్నది వారి నమ్మకం.

పంజాబ్‌లో కూడా ఇదే రోజున కొత్త సంవత్సర ఉత్సవాలు జరుగుతాయి.. దీన్ని వారు బైశాఖీగా (baisakhi)జరుపుకుంటారు. మనకు సంక్రాంతి ఎలాగో వారికి ఇది పంటల పండుగ కూడా! రబీ పంట నూర్పిడి సమయం ఇదే. అందుకే వారిలో అంత అనందం. తమ సంప్రదాయ నృత్యాలతో ఆ సంబరాలను పంచుకుంటారు. కొత్తగా పండిన గోధుములను పట్టించి, ఆ పిండితో రొట్టెలను, తీపిని చేసుకుంటారు. పంజాబ్‌లోనే కాదు. హర్యానాలోనూ వైశాఖి పండుగ ఘనంగా జరుగుతుంది. భాంగ్రా నృత్యాలు(bhangra). గిద్దాలతో ఉత్సవాలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. పండుగ జాతరల గురించి ఎంత చెప్పినా తక్కువే! పాకిస్తాన్‌ (pakisthan)పంజాబ్‌లోనూ వైశాఖి ఉత్సవాలు గ్రాండ్‌గా జరుగుతాయి. ఒడిషా ప్రజలను ఉగాదిని మహా బిశుబ అంటారు. ఉగాది పచ్చడిలాగే అక్కడ పటిక బెల్లంతో చేసిన పానకాన్ని సేవిస్తారు. పండ్లు..పాలు.. బెల్లం.. పెరుగు.. చింతపండు రసాలతో కలిపి చేసిన పానకంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఉత్సవాలు, ఊరేగింపులు మామూలే! అస్సామీయులు కొత్త సంవత్సర వేడుకను బొహాగ్‌ బిహు (bohag bihu)అంటారు. అస్సాం భిన్న జాతులకు, విభిన్న తెగలకు నెలవు. ఈ పండుగ మాత్రం అందరని ఒక్కటి చేస్తుంది.. పంట చేతికొచ్చిన ప్రతి సందర్భంలోనూ అస్సామీలు పండుగ చేసుకుంటారు. సంవత్సరాదిగా జరుపుకునే రొంగాలి బిహూ కూడా పంటల పండుగే! అందుకే పొలంలోనే ఉత్సవాలను ప్రారంభిస్తారు. వ్యవసాయ పనిముట్లను..పశువులను పూజిస్తారు. ఆట పాటలలో మునిగి తేలతారు. మణిపూర్‌లో సంవత్సరాదిని చైరావోబా (cheiraoba) అంటారు. మనం ఉగాది జరుపుకునే రోజునే వీరు చైరావోబాను జరుపుకుంటారు. కశ్మీరీలకు కూడా ఇదే రోజు సంవత్సరాది. ఇక మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, ఉత్తరాఖండ్‌, బీహార్‌, హిమాచల్‌ప్రదేశ్‌, జార్ఖండ్‌, చత్తీస్‌గఢ్‌లలో అక్కడక్కడ రంగులు చల్లుకునే సంప్రదాయం కూడా ఉంది.

మన దేశంలోనే కాదు.. ఆసియా ఖండంలోని చాలా దేశాల ప్రజలు ఇదే సీజన్‌లో దాదాపుగా ఏప్రిల్‌ పద్నాలుగునే కొత్త సంవత్సరం ఆరంభ వేడుకలను జరుపుకుంటారు. పొరుగునే ఉన్న నేపాల్‌ దేశంలో పదకొండు నుంచే నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయి.. 15 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. సూర్యమాన క్యాలెండర్‌ను అనుసరిస్తారు కాబట్టి ప్రతి ఏడాది ఇదే రోజున ఈ పండుగ వస్తుంది.. ఆ రోజున పబ్లిక్‌ హాలీడే! సాంస్కృతిక ఊరేగింపులు.. ఉత్సవాలు.. కుటుంబ సమ్మేళనాలు, సంబరాలు అన్నీ ఉంటాయి. క్రీస్తుశకం 879 నుంచి నేపాల్‌లో నూతన సంవత్సర వేడుకలు మొదలయ్యాయి.. అయితే నేపాల్‌లో తొమ్మిది భిన్నమైన నూతన సంవత్సర ఆరంభ రోజులున్నా నేపాల్‌ సంబట్‌నే నేషనల్‌ న్యూ ఇయర్‌గా పరిగణిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. చాలా మంది న్యూ ఇయర్‌ను పురస్కరించుకుని విహారయాత్రలకు వెళతారు. ఉద్యోగనిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లిన కుటుంబ సభ్యులంతా ఒక్కచోటకు చేరతారు.. పండుగ భోజనాన్ని ఆస్వాదిస్తారు.. కబుర్లు చెప్పుకుని ఆనందిస్తారు. ప్రభుత్వ, ప్రయివేటు భవనాలు విద్యుద్దీపాలతో మెరిసిపోతాయి. దేవాలయాలు కిటకిటలాడతాయి.. ఖాట్మాండుతో పాటు పలు ప్రధాన నగరాలలో వాయిద్యాల చప్పుళ్ల మధ్య పెద్ద ఊరేగింపు సాగుతుంది. ప్రజలు సంప్రదాయ దస్తులు ధరిస్తారు.. అందంగా అలంకరిచిన తోరణాలు అంతటా కనిపిస్తాయి. కఠ్మాండుకు శివార్లలోఉన్న భక్తపూర్‌లో భైరవుడి రథోత్సవం కనువిందు చేస్తుంది.

మరో పొరుగు దేశం మియన్మార్‌(Myanmar)లో కొత్త సంవత్సర వేడుకలు ఆల్‌రెడీ మొదలయ్యాయి. ఏప్రిల్‌ 13 నుంచి 16 వరకు ఈ వేడుకలను జరుపుకుంటారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు వారు జల ఉత్సవాన్ని నిర్వహిస్తారు. దీన్ని తింగ్యాన్‌ అంటారు.. నాలుగు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి.. అయితే గత సంవత్సరం ఈ వేడుకలు విషాదాన్ని మిగిల్చాయి.. 285 మంది చనిపోయారు.. వెయ్యికి పైగా గాయపడ్డారు. అంతకు ముందు ఏడాది కూడా ఇలాగే జరిగింది.. తింగ్యాన్‌ (thingyan)వేడుకల్లో ప్రజలు ఒకరిపై ఒకరు నీళ్లు చిమ్ముకుంటారు.. మన హోలీ పండుగలాగే! కాకపోతే విచ్చలవిడిగా ప్రవహించే మద్యం... పెద్ద ఎత్తున సాగే మాదక ద్రవ్యాల వినియోగం ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి.. దోపిడీలు.. హత్యలు మామూలే!

కంబోడియా(Cambodia) ప్రజలు తమ నూతన సంవత్సరాన్ని ఏప్రిల్‌ 14 నుంచి 16 వరకు మూడు రోజుల పాటు జరుపుకోబోతున్నారు. ఈ పండుగను మహా సంగ్రాన్‌ (Moha Sangran) అంటారు. చోల్‌చమ్‌ మే అని కూడా అంటారు. మహా సంగ్‌క్రాంత(Moha Sangkranta) అనే సంస్కృతపదం నుంచి మహా సంగ్రాన్‌ వచ్చింది. ప్రజలంతా కొత్త దుస్తులు ధరించి బౌద్ధ ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తారు. అగరొత్తులు వెలిగించి ప్రార్థనలు చేస్తారు.. తమకు జ్ఞానాన్ని.. సంపదను ప్రసాదించిన బుద్ధభగవానుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. పవిత్ర జలంతో మొహాన్ని శుభ్రం చేసుకుంటారు. మూడు రోజుల పండుగలో రెండో రోజును విరీక్‌ వనబట్‌గా పిల్చుకుంటారు. ఆ రోజున తమ తాహతుకు తగిన విధంగా పేదలకు ఆర్ధిక సాయం చేస్తారు. మూడో రోజును వీరాక్‌ లియాంగ్‌ సాక్‌ అంటారు. బౌద్ధ విగ్రహాలకు జలాభిషేకం చేస్తారు. తమ నివాసాలను శుభ్రం చేసుకుంటారు. తమకు అదృష్టాన్ని.. సంతోషాన్ని.. ఆరోగ్యాన్ని.. సంపదను ఇవ్వాలని భగవంతుడిని వేడుకుంటారు. థాయ్‌లాండ్‌ ప్రజలు ప్రకట్‌ సాంగ్‌క్రాన్‌ (Songkran) పేరుతో కొత్త నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు. వీరు కూడా మూడు రోజుల పాటు వేడుకలు చేసుకుంటారు. లావోస్‌ (laos )ప్రజలు కూడా ఇదే రోజున న్యూ ఇయర్‌ను జరుపుకుంటారు.. ఈ పండుగను పీ మాయ్‌ అని పిల్చుకుంటారు.

Updated On 13 April 2023 6:16 AM GMT
Ehatv

Ehatv

Next Story