Chandrababu Bail : చంద్రబాబు బెయిల్పై సుప్రీంకు ఏపీ సీఐడీ
స్కిల్ కేసులో(Skill Development Case) ఏపీ హైకోర్టు(AP High Court) టీడీపీ(TDP) అధినేత చంద్రబాబుకు(Chandrababu) రెగ్యులర్ బెయిల్(Regular Bail) మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు(Supreme court) వెళ్లాలని ఏపీ సీఐడీ(APCID) నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఏపీ సీఐడీ లీగల్ టీమ్ ఢిల్లీకి(Delhi) చేరుకుంది.
స్కిల్ కేసులో(Skill Development Case) ఏపీ హైకోర్టు(AP High Court) టీడీపీ(TDP) అధినేత చంద్రబాబుకు(Chandrababu) రెగ్యులర్ బెయిల్(Regular Bail) మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు(Supreme court) వెళ్లాలని ఏపీ సీఐడీ(APCID) నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఏపీ సీఐడీ లీగల్ టీమ్ ఢిల్లీకి(Delhi) చేరుకుంది. ఏపీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో పాటు లీగల్ టీం సభ్యులు ఢిల్లీకి వెళ్లారు. ఈ మేరకు మంగళవారం చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ మంజూరు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.
చంద్రబాబుకు బెయిల్ మంజూరు విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల పరిధిని హైకోర్టు అతిక్రమించిందని సీఐడీ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కేసు మెరిట్‌లలోకి వెళ్లకూడదని పేర్కొంటూనే.. మెరిట్‌లపై తీర్పును ప్రకటించి.. హైకోర్టు తన అధికార పరిధిని దాటిపోయినట్లు సీఐడీ అభిప్రాయపడుతోంది. తాము కోరిన సమాచారాన్ని ఇప్పటి వరకూ టీడీపీ ఇవ్వలేదని.. బెయిల్ సందర్భంగా లేవనెత్తిన అభ్యంతరాలపై కూడా పిటిషనర్ ఎలాంటి వాదనలు చేయలేదని సీఐడీ అసంతృఫ్తి వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలోనే తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించేందుకు సిద్ధమైంది సీఐడీ.