Vizag Cruise Services : విశాఖపట్నం నుంచి సింగపూర్‌కు క్రూయిజ్ సేవలు
ప్రపంచ పర్యాటక రంగంలో(World Tourism) విశాఖపట్నానికి(Vizag) ప్రత్యేక గుర్తింపు రానుంది. ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధానిగా ఇప్పటికే ప్రత్యేకతను చాటుకున్న విశాఖకు మరికొన్ని రోజుల్లో అదనపు హంగులు రాబోతున్నాయి.

Vizag Cruise Services
ప్రపంచ పర్యాటక రంగంలో(World Tourism) విశాఖపట్నానికి(Vizag) ప్రత్యేక గుర్తింపు రానుంది. ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధానిగా ఇప్పటికే ప్రత్యేకతను చాటుకున్న విశాఖకు మరికొన్ని రోజుల్లో అదనపు హంగులు రాబోతున్నాయి. చెన్నై నుంచి విశాఖ మీదుగా సింగపూర్‌కు క్రూయిజ్ సేవలు(Cruise) మార్చిలో ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం లిట్టోరల్ క్రూయిజ్ లిమిటెడ్‌తో(Littoral Cruises Ltd) ఒప్పందం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. భవిష్యత్తులో విశాఖ నుంచి థాయిలాండ్(Thailand), మలేషియా(Malasiya) శ్రీలంక(Srilanka), మాల్దీవులుకు(Maldives) కూడా క్రూయిజ్ సేవలు అందుబాటు లోకి తెస్తామని అధికారులు వెల్లడించారు.
