కోలీవుడ్ సూపర్‌స్టార్ దళపతి విజయ్ రాజకీయ పార్టీని స్థాపించారు.
కోలీవుడ్ సూపర్‌స్టార్ దళపతి విజయ్ రాజకీయ పార్టీని స్థాపించారు. ఎనిమిది నెలల కిందట తమిళగ వెట్రి కళగం(Tamilaga Vetri Kalagam) అనే పార్టీని పెట్టిన విజయ్ మరో రెండేళ్లలో తమిళనాడు(Tamilnadu) అసెంబ్లీ ఎన్నికల్లో తలపడటానికి రెడీ అవుతున్నాడు. ఇందులో భాగంగానే మొన్నపార్టీ తొలి మహానాడు సభను నిర్వహించారు. అది సూపర్ డూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సభ ద్వారా విజయ్ స్పష్టమైన సందేశాన్ని పంపించారు. మతం, భాష అంటూ ప్రజలను చీల్చి రాజకీయం చేస్తే శక్తులు, ద్రవిడ నమూనా అంటూ రాష్ట్రాన్ని దోచుకుంటున్న అవినీతిపరులే తమ పార్టీకి ప్రధాన శత్రువులు అని చెప్పారు. ద్రవిడ ఉద్యమ సారథి పెరియార్(Sarathi Periyar), కామరాజ్(Kamaraj), బీఆర్ అంబేద్కర్(BR Ambedkar), వీరనారీ వేలూ నాచియార్(Velu Nachiar)లను ఆదర్శకంగా తీసుకుని ముందుకు సాగుతామని చెప్పారు. విజయ్‌కు కోలీవుడ్‌కు చెందిన వారు అభినందనలు, శుభాకాంక్షలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawankalyan) కూడా విజయ్‌కు అభినందనలు తెలిపారు. ఎక్స్ ద్వారా సందేశం పంపించారు. ఆయన ఏమన్నారంటే 'ఎంతో మంది సాధువులు, సిద్ధులకు నెలవైన తమిళనాడులో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నటుడు విజయ్‌కు నా హృదయపూర్వక అభినందనలు' అని పవన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసి విజయ్ బిత్తరపోయి ఉంటారు. తాను పెట్టింది రాజకీయ పార్టీనా? లేకపోతే మత సంస్థనా? అన్న అనుమానం ఆయనకు కలిగి ఉంటుంది. మత రాజకీయాలు చేస్తూ ప్రజలను చీలుస్తున్నదంటూ బీజేపీ(BJP)పై విజయ్ మండిపడుతుంటే, అదే బీజేపీ కొమ్ముకాస్తున్న పవన్ అవేమీ పట్టించుకోకుండా సాధువులు, సిద్ధులు అని అంటూ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలు పవన్ ఏం చెప్పదల్చుకున్నారో కనీసం ఆయనకైనా అర్థమవుతుందా అని నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. అవును మరి., ఓ పట్టాన అర్థమవుతే, ఆయన పవన్ కల్యాణ్ ఎందుకవుతారు?