Nara Lokesh Recevied Notices : సీఐడీ నోటీసులు తీసుకుంటా
సీఐడీ నోటీస్‌లపై(CID Notices) టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో నేతలకు స్పష్టం చేశారు. తాను ఢిల్లీలోనే ఉన్నానని, ఇప్పుడు హోటల్ మౌర్యలో(Hotel Mourya) ఉన్నానని వెల్లడించారు. ప్రతి రోజూ పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్నానన్నారు.

Nara Lokesh Recevied Notices
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh)
సీఐడీ నోటీస్‌లపై(CID Notices) టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో నేతలకు స్పష్టం చేశారు. తాను ఢిల్లీలోనే ఉన్నానని, ఇప్పుడు హోటల్ మౌర్యలో(Hotel Mourya) ఉన్నానని వెల్లడించారు. ప్రతి రోజూ పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్నానన్నారు. 50 అశోక రోడ్‌లో ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో కూడా ఉంటున్నానన్నారు. అప్పుడప్పుడు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కార్యాలయానికి వెళ్తున్నానని లోకేష్ వెల్లడించారు. నేను ఎక్కడికి పోలేదు. సీఐడీ వాళ్ళు ఎవరు నా దగ్గరకు రాలేదు. వాళ్ళు వస్తే నోటీస్లు తీసుకుంటా. దాక్కునే అలవాటు నాకు లేదు. ఎవరో ఏదో ప్రచారం చేస్తే నాకేంటి సంబంధం? నేను ఢిల్లీ వచ్చిన నాటి నుంచి ఎక్కడ ఉంటున్నా అనేది అందరికీ తెలుసు. కావాలని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదని పార్టీ నేతలకి, కార్యకర్తలకు, ప్రజలకు నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు తాను ఉంటున్న ప్రాంతాల అడ్రస్‌తో సహా చెప్పి కౌంటర్ ఇచ్చారు.
