ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ(AP BJP) అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి(Daggubati Purandeshwari) లోక్‌సభకు(Lok Sabha) వెళ్లాలన్న కోరిక ఉండింది. బీజేపీ నుంచి పోటీ చేస్తే ఆ కోరిక నెరవేదరన్న విషయం ఆమెకు కూడా తెలుసు. అందుకే తెలుగుదేశం(TDP)-జనసేన(Janasena) కూటమిలో బీజేపీ కూడా చేరితో బాగుండని ఆశపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ(AP BJP) అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి(Daggubati Purandeshwari) లోక్‌సభకు(Lok Sabha) వెళ్లాలన్న కోరిక ఉండింది. బీజేపీ నుంచి పోటీ చేస్తే ఆ కోరిక నెరవేదరన్న విషయం ఆమెకు కూడా తెలుసు. అందుకే తెలుగుదేశం(TDP)-జనసేన(Janasena) కూటమిలో బీజేపీ కూడా చేరితో బాగుండని ఆశపడ్డారు. ఎలాగైనా సరే టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని ఆకాంక్షించారు. టీడీపీ-జనసేన సహకారంతో ఈజీగా గెలిచేయవచ్చని, లోక్‌సభలో అడుగుపెట్టవచ్చని అనుకున్నారు. కానీ బీజేపీ నాయకత్వం మాత్రం మరోలా భావిస్తోంది. టీడీపీతో కలిసి వెళ్లడానికి బీజేపీ ఇష్టపడటం లేదు. ఈ విషయం పురందేశ్వరినే చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలలోఎ పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ శివప్రకాశ్‌(shiva Prakash) తమకు దిశానిర్దేశం చేసినట్టు పురందేశ్వరి చెప్పారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. అధికారపక్షం వైసీపీ ఆల్‌రెడీ మెజారిటీ అభ్యర్థులను ప్రకటించేసింది. ఎన్నికలకు సంసిద్ధమవుతోంది. మరోవైపు టీడీపీకి కూడా బీజేపీతో జతకట్టడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తోంది. కలిసి పోటీ చేస్తే గెలవలేమోనన్న భయం టీడీపీకి ఉంది. అంటే ఈసారి పురందేశ్వరి ఆశలు నెరవేరడం కష్టమేననిపిస్తోంది.

Updated On 29 Jan 2024 3:29 AM GMT
Ehatv

Ehatv

Next Story