బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari) ఏపీ మద్యం(Alcohol) పాలసీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ కంపెనీలు మద్యం తయారు చేస్తున్నాయో వివరాలను బయటపెట్టారు. ప్రభుత్వం ఆయా కంపెనీల వివరాలను చెప్పడం లేదు కాబట్టే తాము చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. కంపెనీల పేర్లు బయటపెట్టాలని గతంలోనే ప్రభుత్వాన్ని కోరితే ఎలాంటి స్పందన లేదని తెలిపారు.

లెక్కల్లోకి రాని మద్యం డబ్బుల వివరాలేవి?
మా సవాల్‌కు ప్రభుత్వం స్పందించలేదు
మద్యం అవకతవకలపై విచారణ చేయించాలని కేంద్రమంత్రిని కోరాం
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి

బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari) ఏపీ మద్యం(Alcohol) పాలసీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ కంపెనీలు మద్యం తయారు చేస్తున్నాయో వివరాలను బయటపెట్టారు. ప్రభుత్వం ఆయా కంపెనీల వివరాలను చెప్పడం లేదు కాబట్టే తాము చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. కంపెనీల పేర్లు బయటపెట్టాలని గతంలోనే ప్రభుత్వాన్ని కోరితే ఎలాంటి స్పందన లేదని తెలిపారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్(AP Beverages Corporation) వద్ద 100 కంపెనీలు నమోదయ్యాయని, అందులో 74 శాతం మద్యం సరఫరాను కేవలం 16 కంపెనీలే చేస్తున్నాయని వెల్లడించారు. వైఎస్ జగన్(YS Jagan) అధికారంలోకి రాకముందు దశలవారీ మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చారని.. మద్యం తయారీదారులు, విక్రయదారులను జైలుకు పంపుతామన్నారని.. ఇక ఇప్పుడు తామే తయారీదారుల జాబితా విడుదల చేశాం కాబట్టి ఎప్పుడు అరెస్టు చేస్తారో చెప్పాలని నిలదీశారు. దశలవారీగా మద్య నిషేధం అమలులోకి తీసుకొస్తామని విరివిగా మద్యాన్ని మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. మద్యం దుకాణాల్లో ఫోన్‌ పే, గూగుల్‌ పే వంటివి ఎందుకు కన్పించడం లేదని, మద్యం అవకతవకలపై విచారణ చేయించాలని కేంద్రమంత్రిని కోరినట్లు పురందేశ్వరి తెలిపారు.

ఏపీలోని డిస్టలరీస్ యజమానుల వివరాలు ఇవ్వగలరా? అని మేము సవాల్ విసిరామని, కానీ ప్రభుత్వం స్పందించ లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. ఈ సందర్బంగా బుధవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఏపీ బెవరెజెస్ కార్పోరేషన్ వద్ద 100కు డిస్టలరీ కంపెనీల నమోదయ్యాయని, కానీ 74 శాతం మద్యం సరఫరాను కేవలం 16 కంపెనీలే చేస్తున్నాయన్నారు. అదాన్ డిస్టలరీస్ 2019లో మొదలైందని, రూ. 1164 కోట్ల మేర మద్యం సరఫరా ఆర్డర్ అదాన్ కంపెనీకే ఉన్నాయన్నారు. అదాన్ కంపెనీ వెనుక ఎంపీ విజయసాయి రెడ్డి ఉన్నారని, ఈ రెండు కంపెనీలను అదాన్ బలవంతంగా చేజిక్కించుకుందని ఆమె ఆరోపించారు. చింతకాయల రాజేష్, పుట్టా మహేష్ వంటి వారికి చెందిన సంస్థలను బలవంతంగా అదాన్ కంపెనీ చేజిక్కించుకుందన్నారు.

ఎస్పీవై అగ్రస్ సంస్థకు రూ. 1800 కోట్ల మేర సరఫరా ఆర్డర్స్ ఉన్నాయని, ఈ సంస్థ వెనుక మిధున్ రెడ్డి(Midhun Reddy) ఉన్నారని పురంధరేశ్వరి ఆరోపించారు. ప్రకాశం జిల్లాలో పెర్ల్ డిస్టలరీస్ దీన్ని సీఎం జగన్ సన్నిహితులు బలవంతం పెట్టి సబ్ లీజుకు తీసుకున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి మద్యం సరఫరా చేసే కంపెనీల జాబితా, ఆ కంపెనీల ఓనర్ల జాబితా ఇవ్వాలంటే ఇవ్వలేదని, ఇప్పుడు మేమే ఆ వివరాలు బయట పెట్టామన్నారు. దశలవారీ మద్య నిషేధం చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని, మద్యం తయారీదారులు, అమ్మకం దారులను ఏడేళ్ల పాటు జైలుకు పంపుతామన్నారని, ఇప్పుడు మద్యం తయారీదారుల జాబితా విడుదల చేశామని, వారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని పురంధరేశ్వరి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లెక్కల్లోకి రాని మద్యం డబ్బుల వివరాలేవి?. మద్య నిషేధం అమలు చేయబోమని చెప్పి మరీ మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారన్నారు. ఫోన్ పే, గూగుల్ పే వంటివి మద్యం దుకాణాల్లో ఎందుకు కన్పించవని పురంధరేశ్వరి నిలదీశారు.

ఏపీలో అప్పుల భారాలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala Sitharaman) ను కలిసి ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఫిర్యాదు చేశామని దగ్గుబాటి పురంధరేశ్వరి చెప్పారు. పార్లమెంట్‌ లో చేసిన ప్రకటన ఆధారంగా ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందని వివరించామన్నారు. కార్పోరేషన్లు, రాష్ట్ర ఆస్తులను తనఖా పెట్టి అప్పులు తెచ్చారని, ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశామన్నారు. సీరియల్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్, ఐటీ, ఈడీ ద్వారా మద్యం కుంభకోణాలపై విచారణ చేపట్టాలని కేంద్రమంత్రికి వినతి పత్రం ఇచ్చామని దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు.

Updated On 25 Oct 2023 5:15 AM GMT
Ehatv

Ehatv

Next Story