ఏపీలో(AP) తమ పొత్తులను హైకమాండ్ నిర్ణయిస్తుందని బీజేపీ(BJP) రాష్ట్ర అధ్య‌క్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeshwari) అన్నారు. ఏలూరు జిల్లా దండమూడిలో జిల్లా బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతానికి జనసేనతో(Janasena) తమ పొత్తు కొనసాగుతోందని.. తమతో తెగదెంపులు చేసుకున్నట్టు జనసేన ఎక్కడైనా చెప్పిందా? అని ప్రశ్నించారు.

ఏపీలో(AP) తమ పొత్తులను హైకమాండ్ నిర్ణయిస్తుందని బీజేపీ(BJP) రాష్ట్ర అధ్య‌క్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeshwari) అన్నారు. ఏలూరు జిల్లా దండమూడిలో జిల్లా బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతానికి జనసేనతో(Janasena) తమ పొత్తు కొనసాగుతోందని.. తమతో తెగదెంపులు చేసుకున్నట్టు జనసేన ఎక్కడైనా చెప్పిందా? అని ప్రశ్నించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేలా బీజేపీని సన్నద్ధం చేస్తున్నామని చెప్పారు. ఏపీలో దొంగ ఓట్లపై(Fake votes) తాము కూడా పోరాటం చేస్తున్నామని తెలిపారు. నకిలీ ఐడీలతో దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశాన్ని ఎన్నికల కమిషన్ కు కూడా వివరించామని తెలిపారు.

రాష్ట్రంలో విధ్వంసక పాలన చూస్తున్నామన్నారు. ఆడుదాం ఆంధ్రా కాదు. వైసీపీ నేతలు ఆంధ్రతో ఆడుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు. ప్రతి పైసా తమ జేబుల్లోకి వెళ్లాలనేది వైసీపీ ఆలోచన అని విమర్శించారు. ఏపీ రాజధాని అమరావతేనని(Amaravati) కేంద్రం పార్లమెంటు సాక్షిగా ప్రకటించిందని.. రాజధాని అమరావతికి కేంద్రం నిధులు కూడా ఇచ్చిందని వెల్లడించారు. పోలవరం నిర్మాణంలో ప్రతి పైసా కేంద్రానిదేనని.. త్వరలోనే పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని తెలిపారు.

Updated On 16 Dec 2023 6:25 AM GMT
Ehatv

Ehatv

Next Story