ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలాఖరు నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.5.62 లక్షల కోట్లకు చేరుతాయని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు.

ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలాఖరు నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.5.62 లక్షల కోట్లకు చేరుతాయని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (GDP)లో అప్పులు 34.70 శాతం ఉంటాయన్నారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం(2023–24)లో జీఎస్డీపీలో అప్పులు 34.58 శాతమని చెప్పారు. సోమవారం లోక్‌సభలో ఎంపీ మనీష్ తివారి(MP Manish Tewari) అడిగిన ప్రశ్నకు దేశంలోని రాష్ట్రాల అప్పుల వివరాలను పంకజ్ చౌదరి వెల్లడించారు. తెలంగాణ(Telangana)కు రూ.4,42,298 కోట్ల అప్పులు ఉన్నాయని కేంద్రం లోక్‌సభలో వెల్లడించింది. ఈ విషయంలో దేశంలో తెలంగాణ 24వ స్థానంలో ఉందని ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి(Pankaj Chaudhary) తెలిపారు. అలాగే రాష్ట్రంలో గత 6 ఏళ్లలో 10,189 IT కంపెనీలు ప్రారంభమయ్యాయని కేంద్ర మంత్రి హర్ష మల్హోత్రా(Harsha Malhotra) తెలిపారు. ఇదే సమయంలో 3,369 సంస్థలు మూతపడ్డాయని పేర్కొన్నారు. ఈ కంపెనీల ద్వారా గత ఐదేళ్లలో రూ.14,865 కోట్ల టర్నోవర్ జరిగిందని సభకు ఆయన వివరించారు.
