✕
ఆ ఏడుగురు సహోదరిమణుల అందమే అందం! అదేనండి సెవన్ సిస్టర్స్(Seven sisters).! ఇంకా అర్థం కాలేదా..? ఈశాన్య రాష్ట్రాల అందాల గురించి చెబుతున్నా.! ఆ రాష్ట్రాలలో నాగాలాండ్(Nagaland) అందమే అందం! ఇక పండుగో వేడుకో ఉన్నప్పుడు ఆ అందం రెట్టింపు అవుతుంది. ఇప్పుడక్కడ వోలింగ్(aoling festival) అనే ఫెస్టివల్ జరుగుతోంది. సోమవారం మొదలైన ఈ పండుగ పది రోజుల పాటు అంటే ఈ నెల 12వ తేదీ వరకు జరుగుతుంది. ఆ పండుగ విశేషాలను తెలుసుకుందాం! రమణీయమైన ప్రకృతి అందాలకు విలాసం నాగాలాండ్.

x
Aoling Festival
-
- ఆ ఏడుగురు సహోదరిమణుల అందమే అందం! అదేనండి సెవన్ సిస్టర్స్(Seven sisters).! ఇంకా అర్థం కాలేదా..? ఈశాన్య రాష్ట్రాల అందాల గురించి చెబుతున్నా.! ఆ రాష్ట్రాలలో నాగాలాండ్(Nagaland) అందమే అందం! ఇక పండుగో వేడుకో ఉన్నప్పుడు ఆ అందం రెట్టింపు అవుతుంది. ఇప్పుడక్కడ వోలింగ్(aoling festival) అనే ఫెస్టివల్ జరుగుతోంది. సోమవారం మొదలైన ఈ పండుగ పది రోజుల పాటు అంటే ఈ నెల 12వ తేదీ వరకు జరుగుతుంది. ఆ పండుగ విశేషాలను తెలుసుకుందాం! రమణీయమైన ప్రకృతి అందాలకు విలాసం నాగాలాండ్. హరితవర్ణాన్ని పులముకున్న ఎత్తయిన కొండలు. భూమికి పచ్చటి రంగేసినట్టుగా ఉండే లోతైన లోయలు. మరి మా సంగతో అంటూ తలలు ఎగరేసే రంగురంగుల పూలు. చిత్రవిచిత్ర వేషధారణలతో ఆకట్టుకునే గిరిజన తెగలు. మొత్తంగా అదో అందమైన ప్రాంతం. ఆ అందాన్ని రెట్టింపు చేయడానికి వివిధ వేడుకలు.
-
- ప్రతి సంవత్సరం ఏప్రిల్ మొదటి వారంలో నాగాలాండ్‌లో ఓ సొగసైన వేడుక జరగుతుంది. ఆ ఫెస్టివల్ పేరు వోలింగ్. కొందరు వోలెంగ్ అని కూడా అంటారు. కేవలం కొన్యాక్ తెగ ప్రజలు మాత్రమే జరుపుకునే ఈ వేడుక పరమార్థం పంటలు పుష్కలంగా పండాలని! ఫెస్టివల్ గురించి తెలుసుకునే ముందు అసలు కొన్యాక్ తెగను(Koyank Tribe) కాసింత పరిచయం చేసుకుందాం! నాగాలాండ్‌లోని మోన్ జిల్లా కొన్యాక్ గిరిజన తెగ పుట్టినిల్లు. ఒళ్లంతానే కాదు. ముఖాలకు కూడా పచ్చబొట్లు పొడిపించుకునే కొన్యాక్ ప్రజల వస్ర్తధారణ కూడా విచిత్రంగానూ, ఆసక్తికరంగానూ ఉంటుంది. వారు యుద్ధ వీరులు. యుద్ధంలో వెన్నుచూపడం తెలియని వీరాధివీరులు. చరిత్రలో ఒకప్పుడు హెడ్ హంటర్స్‌గా పేరుగాంచిన కొన్యాక్ గిరిజన తెగ ప్రజలు ఇప్పుడు అవన్నీ మానేసి చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు ప్రియమైన వేటను ఆస్వాదిస్తారు..
-
- ఇప్పుడు శాంతమూర్తుల్లా కనిపిస్తున్న కొన్యాక్ ప్రజల్లో ఒకప్పుడు వీరత్వం ఉట్టిపడేది. యుద్ధం అంటే పడిచచ్చిపోయేవారు. పగలు ప్రతీకారాలతో రగిలిపోయేవారు.. శత్రువుల తలలను తెగనరికి ఇంటిముందు వేలాడదీసుకునేవారు. ఎవరి దగ్గర శత్రువుల పుర్రెలు(Skull) ఎక్కువగా ఉంటాయో వారే వీరాధివీరుడు, శూరాధిశూరుడన్నమాట! అందుకే తలల సేకరణపై ఎక్కువ దృష్టిపెట్టేవారు. ఇదంతా అయిదారు దశాబ్దాల కిందటి మాట! ఇప్పుడు యుద్ధాలకు స్వస్తి చెప్పారు. తమ దృష్టిని వ్యవసాయంవైపు మళ్లించారు.పిల్లలు కూడా కొట్లాటలకు దూరంగా ఉంటూ బుద్ధిగా చదువుకుంటున్నారు. కొన్యాక్ తెగ వారికి ఓ కులపెద్ద ఉంటారు. వంశపారంపర్యంగా ఈ పదవి లభిస్తుంది. ఆయనకు సర్వాధికారాలు ఉంటాయి. మిగతా వారికంటే ఈయన వివాసం వైశాల్యంలో పెద్దగా ఉంటుంది. ఈ జాతిలో మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. జంతువుల కొమ్ములు, చర్మాలు, వెంట్రుకలు వంటివి వంటికి అలంకరించుకుంటారు. మగవారిలో పెద్దవారు అడవిపంది ఎముకలతో చేసిన కర్ణాభరణాలను ధరిస్తుంటారు. వీరు కళాపిపాసులు.
-
- హస్తకళా నైపుణ్యంలో ఆరితేరారు. కొయ్యతో అందమైన కళాకృతులను సృష్టిస్తారు. పూసలతో అందమైన హారాలు తయారు చేస్తారు. కొన్యాక్ తెగ ప్రధాన పండుగ వోలింగ్. ఈ ఫెస్టివల్‌ను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అసలు ఆ పండుగ ఉత్సవాలను తిలకించడానికి రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. వసంతాగమనానికి స్వాగతం పలుకుతూ ఈ వేడుక చేసుకుంటారు. పంటలు సమృద్ధిగా పండాలని భగవంతుడిని ప్రార్థిస్తారు. అన్నట్టు కొన్యాక్ ప్రజల నూతన సంవత్సర ఆరంభం కూడా ఇదే! జిల్లా అంతటా ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి పల్లె అందంగా ముస్తాబవుతుంది. జానపద సంగీతం వీనుల విందు చేస్తుంది. సంప్రదాయ నృత్యాలు కన్నుల పండుగ చేస్తాయి. ఓలింగ్ ఫెస్టివల్లో మొదటి మూడు రోజులను హోయ్లా నిహ్, యిన్ మాక్ ఫో నిహ్, మాక్ షెక్ నిహ్లుగా జరుపుకుంటారు. ఈ మూడు రోజులు ప్రజలంతా సంప్రదాయ దుస్తులు ధరిస్తారు. దైవ ప్రార్థనలతో పాటు జంతు బలులు కూడా ఉంటాయి. నాలుగో రోజును లింగ్న్యు నిహ్గా జరుపుకుంటారు. వోలింగ్ ఫెస్టివల్లో ఇదే అత్యంత ప్రధానమైన వేడుక. రంగురంగుల దుస్తులు ధరిస్తారు. పూసల హారాలు, పక్షి ఈకలు అలంకరించుకుంటారు. రోజంతా ఆటపాటలతోనే గడిపేస్తారు. భూతకాలపు వీరత్వాలను సూచించే పాటలను పాడతారు. చివరి రెండు రోజులు ఇంటినే కాదు ఊరంతటిని పరిశుభ్రం చేస్తారు.వ్యవసాయ పనిముట్లకు పూజలు చేస్తారు..

Ehatv
Next Story