ఉత్తరప్రదేశ్‌కు(Uttar Pradesh) చెందిన అనుష్క జైస్వాల్‌(Anushka Jaiswal) అనే యువతికి ఏ మాత్రం వ్యవసాయ బ్యాగ్రౌండ్‌ లేదు. అసలు తన కుటుంబానికి వ్యవసాయంతో సంబంధమే లేదు. పైగా తను చదువుకుంది కూడా ఆర్థిక శాస్త్రం. అయినా వ్యవసాయంలో మెళుకవలు నేర్చుకుంది. లాభసాటి వ్యవసాయం చేస్తూ ఎందరో యువతీయువకులకు అనుష్క ఆదర్శంగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..

ఉత్తరప్రదేశ్‌కు(Uttar Pradesh) చెందిన అనుష్క జైస్వాల్‌(Anushka Jaiswal) అనే యువతికి ఏ మాత్రం వ్యవసాయ(Agriculture) బ్యాగ్రౌండ్‌ లేదు. అసలు తన కుటుంబానికి వ్యవసాయంతో సంబంధమే లేదు. పైగా తను చదువుకుంది కూడా ఆర్థిక శాస్త్రం. అయినా వ్యవసాయంలో మెళుకవలు నేర్చుకుంది. లాభసాటి వ్యవసాయం చేస్తూ ఎందరో యువతీయువకులకు అనుష్క ఆదర్శంగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..

ఉత్తరప్రదేశ్‌కు చెందిన అనుష్క జైస్వాల్‌ 23 ఏళ్ల వయసులో వ్యవసాయం ప్రారంభించింది. విజయవంతమైన రైతుగా తనను తాను ఆవిష్కరించుకుంది. తనకు 23 ఏళ్లు ఉన్నప్పుడు ఎకరం పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం ప్రారంభించింది. వ్యవసాయం ప్రారంభభించిన నాలుగో ఏటా ఏకంగా 22 లక్షల ఆదాయం సమకూర్చుకుంది. అనుష్క ఢిల్లీలోని హిందూ కాలేజ్‌లో ఎకనామిక్స్‌ చదువుకుంది. అనుష్క కుటుంబం వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చింది కాదు, వారికి భూములు కూడా లేవు. తండ్రి వ్యాపారం చేస్తారు, తల్లి గృహిణి, సోదరి న్యాయవాద వృత్తిలో ఉంది. సోదరుడు పైలెట్‌గా పనిచేస్తున్నాడు. అయితే అనుష్క కొత్తగా ఏదైనా చేయాలన్న తపనతో ఉండేది. వ్యవసాయం చేయాలని నిర్ణయించుకొని కుటుంబంతో చర్చించాక ఆ దిశగా ముందడుగు వేసింది.

ఇందు కోసం నాలుగేళ్ల క్రితం ఎకరం పొలం కౌలుకు తీసుకుంది. వ్యవసాయంలో తర్ఫీదు పొందింది. లాభసాటి పంటలు పండించాలనుకుంది. తొలుత ఎకరం స్థలంలో పాలీ హౌస్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత మరో రెండు ఎకరాలు తీసుకుంది. మూడు ఎకరాల్లో క్యాప్సికం, క్యాలీఫ్లవర్‌, క్యాబేజ్‌ సహా అనేక కూరగాయల పంటలను సాగు చేసింది. ప్రభుత్వం అందించే 50 శాతం సబ్సిడీని కూడా అనుష్క తీసుకుంది. తక్కువ భూమిలో ఎక్కువ పంటలు పండించేలా ప్రణాళికలు రూపొందించుకుంది. ఈ ఏడాది 50 టన్నుల దోసకాయలను పండించింది. లక్నో, స్థానిక మార్కట్లు, షాపింగ్‌ మాల్స్‌లో తను పండించిన పంటలకు గిరాకీ దక్కింది. దీంతో ఈ ఏడాది ఏకంగా 22 లక్షల ఆదాయాన్ని సమకూర్చుకుంది. అంతేకాకుండా మరో 20 మందికి పైగా ఉపాధి కూడా కల్పిస్తోంది. వ్యవసాయం చేయాలంటే మొహమాట పడుతున్న ఈ రోజుల్లో వ్యవసాయమే జీవన ఉపాధిగా మార్చుకున్న అనుష్క అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

Updated On 4 March 2024 1:48 AM GMT
Ehatv

Ehatv

Next Story