సోషల్‌ మీడియా(Social Media) మంచి కంటే చెడే ఎక్కువ చేస్తున్నది. కొందరు అదే పనిగా ట్రోలింగ్‌లతో(Troll) వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. అడ్డమైన విమర్శలు(Criticism), హేళనపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ నిండుప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఇలాగే జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన మేకప్‌ ఆర్టిస్ట్(Makeup Artist) ప్రన్షు (Prashnu)16 ఏళ్ల ప్రాయంలోనే ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) ఉజ్జయినికి(Ujjain) చెందిన ప్రన్షు ద్వేషపూర్తితమైన కామెంట్లను భర్తించలేక ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. విమర్శలను తట్టుకోలేకపోయిన తన కొడుకు చనిపోయాడని తల్లి కన్నీరుమున్నీరవుతున్నారు.

సోషల్‌ మీడియా(Social Media) మంచి కంటే చెడే ఎక్కువ చేస్తున్నది. కొందరు అదే పనిగా ట్రోలింగ్‌లతో(Troll) వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. అడ్డమైన విమర్శలు(Criticism), హేళనపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ నిండుప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఇలాగే జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన మేకప్‌ ఆర్టిస్ట్(Makeup Artist) ప్రన్షు (Prashnu)16 ఏళ్ల ప్రాయంలోనే ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) ఉజ్జయినికి(Ujjain) చెందిన ప్రన్షు ద్వేషపూర్తితమైన కామెంట్లను భర్తించలేక ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. విమర్శలను తట్టుకోలేకపోయిన తన కొడుకు చనిపోయాడని తల్లి కన్నీరుమున్నీరవుతున్నారు. తన కొడుకు మేకప్‌ వేయడం సొంతంగా నేర్చుకున్నాడని, అతడిని చూసి తాను ఎంతో గర్వించానని ప్రన్షు తల్లి తెలిపారు. 12వ తరగతి పూర్తయ్యాక వాడిని ముంబైకి పంపిద్దామని ఇప్పటినుంచే డబ్బులు కూడా దాచిపెడుతున్నానని అన్నారు. 2019లో తాను విడాకులు(Divorce) తీసుకున్నానని, అప్పటినుంచి ప్రన్షుతో కలిసి ఒంటరిగా జీవిస్తున్నానని వివరించారు. 'లాస్టియర్‌ నా కొడుకు వింతగా ప్రవర్తించాడు. అమ్మా నేను అమ్మాయిలు, అబ్బాయిలు ఇలా ఇద్దరి ఆకర్షణకు లోనవుతున్నానని చెప్పాడు. నేను అతడిని తప్పుపట్టలేదు. తను మేకప్‌ వేసుకుంటే కూడా వద్దని వారించలేదు. సింగిల్‌ పేరెంట్‌గా ఎన్నో ఆర్థిక సమస్యలు వస్తుంటాయి. ప్రన్షు ప్రతిరోజు ఎంతో కష్టపడేవాడు. యూట్యూబ్‌ నుంచి మేకప్‌ ఎలా వేయాలని నేర్చుకున్నాడు. జేమ్స్‌ చార్లెస్‌ను(James Charles) చూసి స్ఫూర్తి పొందాడు. అతడిలానే ఉంటాననుకునేవాడు. ఎప్పటికైనా అతడిని కలవాలనుకునేవాడు' అని బరువెక్కిన హృదయంతో ఆ తల్లి చెప్పుకొచ్చారు. 'ప్రన్షు చిన్న వయసులోనే ఎంతో మెచ్యూర్‌గా ఆలోచించేవాడు. ద్వేషపూరిత వ్యాఖ్యలను ఎలా హ్యాండిల్‌ చేయాలో వాడికి బాగా తెలుసు. అంతెందుకు, ట్రోలింగ్‌ చూసి మేమిద్దరం నవ్వుకునేవాళ్లం. తన తండ్రిని కూడా చాలా ఏళ్ల క్రితమే బ్లాక్‌ చేశాడు. మళ్లీ ఎప్పుడూ ఆయన గురించి ఆలోచించలేదు. ప్రన్షు చాలా కష్టపడేతత్వం ఉన్న పిల్లాడు. తనకు ఎగ్జామ్స్‌ ఉండటంతో ట్యూషన్‌ మధ్యలో నుంచి ఇంటికి వచ్చేశాడు. ఉదయం 10 గంటలకు ఫోన్‌ చేసి మాట్లాడాను. అదే తనతో చివరి సంభాషణ అవుతుందని ఊహించలేదు. ఆ తర్వాత నా కొడుకు నాతో మాట్లాడలేదు. వాడు ఎక్కడున్నా రత్నమే. నా పిల్లాడిని నేను కోల్పోయాను. మీ పిల్లలు ఏం కావాలనుకుంటే అది కానివ్వండి. వారిని ఎలా ఉంటే అలా అంగీకరించండి' అంటూ ప్రన్షు తల్లి భావోద్వేగానికి గురయ్యారు. ఆ తల్లి మనోవేదనను షేర్‌ చేసిన గాయని చిన్మయి శ్రీపాద(Chinmayi sripada) 'భారతీయుల్లో పగ, ద్వేషం వంటివి ఎప్పటినుంచో ఉన్నాయా? లేదా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ దొరకడం వల్ల దాన్ని ఇప్పుడు చూపిస్తున్నారా తెలియడం లేదు' అని మండిపడ్డారు. ప్రముఖ హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌(Anupama Parmeshwaran) కూడా స్పందించారు. ఆ వార్త విన్నాక తన గుండె బద్దలయ్యిందని తెలిపారు.

Updated On 1 Dec 2023 7:47 AM GMT
Ehatv

Ehatv

Next Story