పచ్చని కాపురంలో రాజకీయాలు(Politics) చిచ్చు పెట్టాయి. మొన్నటి వరకు  కప్పు కింద ఉన్న భార్య భర్తలు ఇప్పుడు వేర్వేరు ఇంట్లో ఉంటున్నారు. ఈ ఇన్సిడెంట్‌ మధ్యప్రదేశ్‌లోని(MadhyaPradesh) బాలాఘాట్‌(Balaghat) లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో జరిగింది. భార్యాభర్తల మధ్య రాజకీయపరమైన విభేదాలు తలెత్తడంతో చెరో గూటికి చేరుకోవాల్సి వచ్చింది.

పచ్చని కాపురంలో రాజకీయాలు(Politics) చిచ్చు పెట్టాయి. మొన్నటి వరకు కప్పు కింద ఉన్న భార్య భర్తలు ఇప్పుడు వేర్వేరు ఇంట్లో ఉంటున్నారు. ఈ ఇన్సిడెంట్‌ మధ్యప్రదేశ్‌లోని(MadhyaPradesh) బాలాఘాట్‌(Balaghat) లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో జరిగింది. భార్యాభర్తల మధ్య రాజకీయపరమైన విభేదాలు తలెత్తడంతో చెరో గూటికి చేరుకోవాల్సి వచ్చింది. బాలాఘాట్‌ ఎమ్మెల్యే అనుభ ముంజరే(Anubha Munjare) కాంగ్రెస్‌(Congress) పార్టీకిచెందిన వారు. ఆమె భర్త కంకర్‌ ముంజరే(Kankar Munjare) బీఎస్‌పీ(BSP) పార్టీకి చెందిన వారు. పైగా ఆయన ఇప్పుడు బాలాఘాట్‌ లోక్‌సభ నుంచి పోటీ కూడా చేస్తున్నారు. పోలింగ్‌ పూర్తయ్యే వరకు వేరే ఇంట్లో ఉండాలటూ అనుభతో కంకర్‌ చెప్పారట! అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందన్నదానికి వివరణ కూడా ఇచ్చుకున్నాడు. తామిద్దరం ఒకే ఇంట్లో ఉంటే , ఈ ఎన్నికల్లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నామని ప్రజలు భావించే అవకాశం ఉందంటున్నారు కంకర్‌. గ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా తామిద్దరం పోటీ చేశామని, అప్పట్లో ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్నామని, ఇప్పుడు మాత్రం వేర్వేరుగా ఉందామని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని అనుభ అంటున్నారు.

Updated On 1 April 2024 2:34 AM GMT
Ehatv

Ehatv

Next Story