రాజస్తాన్‌(Rajasthan)లోని కోటాల విద్యార్థుల ఆత్మహ్యలు కొనసాగుతున్నాయి. ఉన్నత చదువుల కోసమో, ఉద్యోగాల కోచింగ్‌ కోసమో అక్కడికి వెళుతున్న విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. లేటెస్ట్‌గా మరో విద్యార్థి చనిపోయాడు. హర్యానా రోహ్‌తక్‌(Rohtak)కు చెందిన 20 ఏళ్ల సుమిత్‌ నీట్‌ పరీక్షకు ప్రిపేర్‌ అవుతున్నాడు.

రాజస్తాన్‌(Rajasthan)లోని కోటాల విద్యార్థుల ఆత్మహ్యలు కొనసాగుతున్నాయి. ఉన్నత చదువుల కోసమో, ఉద్యోగాల కోచింగ్‌ కోసమో అక్కడికి వెళుతున్న విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. లేటెస్ట్‌గా మరో విద్యార్థి చనిపోయాడు. హర్యానా రోహ్‌తక్‌(Rohtak)కు చెందిన 20 ఏళ్ల సుమిత్‌ నీట్‌ పరీక్షకు ప్రిపేర్‌ అవుతున్నాడు. ఏడాది కాలంగా కోటాలోని కున్హాడి ల్యాండ్‌మార్క్‌ సిటీలో ఉన్న ఓ హాస్టల్‌లో ఉంటూ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆదవారం సాయంత్రం తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం సాయంత్రం సుమిత్‌కు అతడి తల్లిదండ్రులు చాలా సార్లు ఫోన్‌ చేశారు. అతడు ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో హాస్టల్ వార్డెన్‌కు ఫోన్‌ చేశారు. దాంతో కోచింగ్‌ సెంటర్‌ ఉద్యోగులు సుమిత్‌ గదికి వెళ్లి చూశారు. అప్పటికే అతడు ఉరి వేసుకుని కనిపించాడు. వారు వెంటనే పోలీసులకు కబురుపెట్టారు. ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు సుమిత్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కోటాలో విద్యార్థులు వరుసగా చనిపోవడం కలకలం రేపుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు తొమ్మిది విద్యార్థులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. గత ఏడాది 30 మంది పిల్లలు ఒత్తిడి తట్టుకోలే ప్రాణాలు వదిలారు.

Updated On 29 April 2024 5:27 AM GMT
Ehatv

Ehatv

Next Story