అమృత్‌సర్‌(Amritsar) శ్రీ హరిమందిర్ సాహిబ్ సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్ ప్రాంతంలో సోమవారం ఉదయం 6:30 గంటలకు పేలుడు సంభవించింది. ఇదే ప్రాంతంలో శనివారం అర్థరాత్రి కూడా బాంబ్ బ్లాస్ట్ జ‌ర‌గ‌డం విశేషం. శనివారం అర్థరాత్రి జరిగిన ఘటనకు 200 మీటర్ల దూరంలో ఈ పేలుడు సంభవించింది.

అమృత్‌సర్‌(Amritsar) శ్రీ హరిమందిర్ సాహిబ్ సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్ ప్రాంతంలో సోమవారం ఉదయం 6:30 గంటలకు పేలుడు సంభవించింది. ఇదే ప్రాంతంలో శనివారం అర్థరాత్రి కూడా బాంబ్ బ్లాస్ట్ జ‌ర‌గ‌డం విశేషం. శనివారం అర్థరాత్రి జరిగిన ఘటనకు 200 మీటర్ల దూరంలో ఈ పేలుడు సంభవించింది. ఘటన జరిగిన సమయంలో రోడ్డుపై పెద్దగా ట్రాఫిక్‌ లేదు. పలువురు సీనియర్ పోలీసు అధికారులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. ఫోరెన్సిక్ బృందం సభ్యులు పలు నమూనాలను స్వాధీనం చేసుకున్నారు.

పేలుడు జరిగిన చోట ఒక కారు పార్క్‌చేసి ఉంది. పేలుడు ధాటికి కారు అద్దాలు పగిలిపోయాయి. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. డీజీపీ పంజాబ్‌ గౌరవ్‌ యాదవ్‌, డీసీపీ పర్మిందర్ సింగ్ భండాల్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ కేసులో ఉగ్రవాద కోణం ప్రస్తావనకు రాలేదని డీజీపీ గౌరవ్ యాదవ్ స్పష్టం చేశారు. ఎవరో దుర్మార్గుల పనిలా కనిపిస్తోంది. పేలుడు తక్కువ తీవ్రతతో ఉందని పేర్కొన్నారు.

శనివారం అర్థరాత్రి గోల్డెన్ టెంపుల్ సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్‌లో కూడా పేలుడు సంభవించింది. ఒక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయని, కొన్ని భవనాల కిటికీలు దెబ్బతిన్నాయని సమాచారం. అయితే ఇది ఉగ్రదాడి కాదని పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి పేలుడు సంభవించిన తర్వాత దర్బార్ సాహిబ్ సమీపంలో రద్దీగా ఉండే హెరిటేజ్ స్ట్రీట్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. ఘటనా స్థలంలో ఉన్న పలువురు భక్తులు, స్థానికులు ఈ పేలుడును ఉగ్రవాద ఘటనగా భావిస్తున్నారు.

Updated On 8 May 2023 2:35 AM GMT
Ehatv

Ehatv

Next Story