తమిళనాడు(Tamil Nadu)లో ఎన్నికల వేడి పెరిగింది. విమర్శలు, ప్రతి విమర్శల జోరు పెరిగింది. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై(Annamalai), లోకనాయకుడు కమలహాసన్(Kamal Haasan) మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా కమల్‌పై అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు
తమిళనాడు(Tamil Nadu)లో ఎన్నికల వేడి పెరిగింది. విమర్శలు, ప్రతి విమర్శల జోరు పెరిగింది. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై(Annamalai), లోకనాయకుడు కమలహాసన్(Kamal Haasan) మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా కమల్‌పై అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'దేశ రాజధాని మార్పు అంటూ ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేస్తే వారిని వెంటనే మెంటల్ హాస్పిటల్‌లో చేర్పించాలి. వారి మెదడు సరిగా పనిచేస్తున్నదో లేదో వైద్య పరీక్షలు చేయాలి. మానసిక వైద్యుడు దగ్గరకు వెళ్లి కమల్ సలహాలు తీసుకోవాలి. దేశ రాజధానిని నాగపూర్(Nagpur)
కు ఎలా మారుస్తారు?' అని అన్నామలై ప్రశ్నించారు. చెన్నై(Chennai)ను దేశానికి వేసవి లేదా శీతకాల రాజధానికి చేయాలని కమలహాసన్ అంటే మాత్రం దానికి తాను సపోర్ట్ చేస్తానని అన్నామలై చెప్పుకొచ్చారు. కమల్‌కు డీఎంకే నుంచి రాజ్యసభకు వెళ్లాలని అనుకుంటున్నారని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నామలై తెలిపారు. అన్నామలై వ్యాఖ్యలపై కమలహాసన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీఎంకే కూటమిలో కమలహాసన్ పార్టీ ఎంఎన్‌ఎం చేరిన విషయం తెలిసిందే! కూటమిలో భాగంగా కమల్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థి కళానిధి వీరస్వామికి మద్దతుగా కమల్ పాల్గొని ప్రసంగించారు. 'ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) సారథ్యంలోని ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తే నాగపూర్‌ను భారత్‌కు కొత్త రాజధానిగా చేస్తుంది. బీజేపీ నేతలు, ఆదాయపు పన్ను శాఖ ద్వారా ప్రతిపక్షాలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు' అని కమలహాసన్ అన్నారు. జాతీయజెండా అయిన త్రివర్ణ పతాకం బదులుగా ఒకే రంగు ఉన్న జెండాగా మార్చాలని ప్రయత్నిస్తున్నారని కమల్ ఆరోపించారు. గుజరాత్ మోడల్‌పై కూడా కమలహాసన్ విమర్శలు చేశారు. 'ప్రజలు ఎప్పుడూ గుజరాత్ మోడల్‌ను కోరుకోలేదు. గొప్పదని చెప్పలేదు. గుజరాత్ మోడల్ కన్నా ద్రవిడ మోడల్ ఎంతో గొప్పది. ఆ మోడల్‌నే మేము అనుసరిస్తాము. బీజేపీ నేతలు ద్రవిడ మోడల్‌ను విస్మరిస్తున్నారు' అని కమలహాసన్ అన్నారు.