దున్నపోతులా ఉన్నావ్.. ఏదైనా పని చేసుకుని చావొచ్చు కదా!
దున్నపోతులా ఉన్నావ్.. ఏదైనా పని చేసుకుని చావొచ్చు కదా! అని పెద్దవాళ్లు తిడుతుంటారు. దున్నపోతులంటే అంత తేలికయ్యాయి. ఇక ముందు ఇలా తిట్టడానికి వీలుండదు. ఎందుకంటే దున్నపోతులు(Ox) కూడా లక్షల రూపాయలు సంపాదిస్తున్నాయి. హర్యానాలోని(Haryana) సిర్సాలో పల్వీందర్ సింగ్(Palwindar singh) అనే రైతు ఉన్నాడు. ఆయనకు అన్మోల్ అనే దున్నపోతు ఉంది. అన్మోల్ అంటే విలువ కట్టలేనిది. నిజంగానే ఆ దున్నపోతు విలువ కట్టలేం కానీ, 23 కోట్ల రూపాయలు పలుకుతుంది. ఎవరైనా వచ్చి అంత డబ్బు ఇచ్చి అన్మోల్ తీసుకుంటానన్నా పల్వీందర్ సింగ్ అసలు ఒప్పుకోడు. అన్మోల్ ద్వారా పల్వీందర్ నెలకు ఈజీగా నాలుగైదు లక్షలు సంపాదిస్తున్నాడు. ఆ దున్నపోతు వీర్యాన్ని అమ్ముకోవడం ద్వారా, ఇతరత్రా మార్గాల ద్వారా అయిదు లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ఈ దున్నపోతు బరువు 1500 కిలోల పైనే ఉంటుంది. ఇది అన్ని దున్నపోతుల్లా గడ్డిగాదం తినదు. డ్రైఫ్రూట్స్, గట్రాలు తింటుంది. దీని తిండి కోసమే నెలకు 15 వందల రూపాయలు వెచ్చిస్తాడు పల్వీందర్ సింగ్. అంటే నెలకు ఇంచుమించు లక్ష రూపాయలన్నమాట! ప్రతి రోజూ 250 గ్రాముల బాదాం, నాలుగు కిలోల దానిమ్మలు, 30 అరటిపండ్లు, అయిదు లీటర్ల పాలు, 20 గుడ్లను అన్మోల్ ఈజీగా లాగేస్తుంటుంది. రోజూ సుబ్బరంగా స్నానం కూడా చేస్తుంది.