పబ్జీ గేమ్‌ ద్వారా పరిచయమైన సచిన్‌తో ప్రేమలో కూరుకుపోయి, అతడి కోసం అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చిన పాకిస్తాన్‌ యువతి సీమా హైదర్‌ లాగే ఇక్కడ అంజు(Anju) అనే మహిళ సోషల్‌ మీడియా ద్వారా పరిచయమైన పాక్‌(Pakistan) యువకుడు నస్రుల్లా(Nusrullah) కోసం ఆ దేశానికి వెళ్లి అక్కడ అతడిని పెళ్లి చేసుకుని హాయిగా ఉంటోంది.

పబ్జీ గేమ్‌ ద్వారా పరిచయమైన సచిన్‌తో ప్రేమలో కూరుకుపోయి, అతడి కోసం అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చిన పాకిస్తాన్‌ యువతి సీమా హైదర్‌ లాగే ఇక్కడ అంజు(Anju) అనే మహిళ సోషల్‌ మీడియా ద్వారా పరిచయమైన పాక్‌(Pakistan) యువకుడు నస్రుల్లా(Nusrullah) కోసం ఆ దేశానికి వెళ్లి అక్కడ అతడిని పెళ్లి చేసుకుని హాయిగా ఉంటోంది. మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) గ్వాలియర్‌కు చెందిన అంజు చేసిన నిర్వాకం కారణంగా ఇక్కడున్న ఆమె కుటుంబం ఇబ్బందులు పడుతోంది. అంజుకు ఇదివరకే పెళ్లయిన ఇద్దరు పిల్లలున్న సంగతి తెలిసిందే. ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వకుండానే పాకిస్తాన్‌కు వెళ్లింది.

అప్పట్నుంచి అంజు భర్త, ఆమె తండ్రి, సోదరుడు ఈ ముగ్గరూ తమ వృత్తి జీవితంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట! అంజు భర్తను ఆయన పని చేస్తున్న సంస్థ ఉద్యోగంలోంచి తీసేయలేదు కానీ ఎలాంటి పని చెప్పకుండా బెంచ్‌కే పరిమితం చేసిందట! అంటే ఆయనే ఉద్యోగంలోంచి వైదొలిగేట్టు చేస్తున్నదన్నమాట! పొమ్మన లేక పొగపెట్టడమంటే ఇదే! ఇక ఆమె సోదరుడైతే ఉద్యోగం కోల్పోయారట! ఆమె తండ్రి టైలర్‌గా పని చేస్తున్నారు. అంజు పాక్‌కు వెళ్లినప్పడ్నుంచి చుట్టుపక్కల వారు ఆ కుటుంబానికి దూరంగా ఉంటున్నారట! అందుకే ఆయనకు పని దొరకడం లేదని తెలుస్తోంది.

బౌనా గ్రామంలో ఉంటున్న అంజు తండ్రిపై గ్రామస్తులు మొదట సానుభూతి చూపించారు కానీ తర్వాతతర్వాత ఆయన పట్ల వ్యతిరేకత చూపించడం మొదలుపెట్టారట! దాంతో ఆయన టైలరింగ్‌ పని కుంటుపడిందని సన్నిహితులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే అంజు సరిహద్దులు దాటి వెళ్లి అక్కడ ప్రియుడు నస్రుల్లాను పెళ్లాడటం వెనుక అంతర్జాతీయ కుట్ర ఉందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. వీటిని నివృత్తి చేసుకోవడానికి మధ్యప్రదేశ్‌ హోంశాఖ మంత్రి నరోత్తమ్‌ మిశ్రా దర్యాప్తునకు ఆదేశించారు. నస్రుల్లాను పెళ్లి చేసుకున్న తర్వాత అంజు తన పేరును ఫాతిమాగా మార్చుకుంది. అక్కడ ఆ జంటకు ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ యజమాని మోహసిన్‌ ఖాన్‌ అబ్బాసి కొంత భూమిని, నగదును కానుకగా ఇచ్చాడు. ప్రస్తతం ఈ కొత్త జంట ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్సు అప్పర్‌ దిర్‌ జిల్లాలోని ఓ గ్రామంలో నివసిస్తోంది.

Updated On 4 Aug 2023 5:01 AM GMT
Ehatv

Ehatv

Next Story