అమెరికాలోని(America) పోర్ట్‌ల్యాండ్‌(Portland) ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road accident) గాయపడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న గీతాంజలి చనిపోయినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. 32 ఏళ్ల గీతాంజలి కుటుంబసభ్యులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది.

అమెరికాలోని(America) పోర్ట్‌ల్యాండ్‌(Portland) ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road accident) గాయపడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న గీతాంజలి చనిపోయినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. 32 ఏళ్ల గీతాంజలి కుటుంబసభ్యులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గీతాంజలి కూతురు హానిక అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన గీతాంజలిని ఆసుపత్రిలో చేర్పించారు. సోమవారం ఆమె చనిపోయారు. భర్త నరేశ్‌, కుమారుడు బ్రమణ్‌కు కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో తల్లీ, కుమార్తెల మృతితో వారి బంధువుల కుటుంబాల్లో విషాదం అలముకుంది. వారి మృతదేహాలను ఎన్టీఆర్‌ జిల్లా, పెనుగంచిప్రోలు మండలంలోని వారి స్వగ్రామం కొణకంచికి తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బంధువులు తెలిపారు.

Updated On 2 April 2024 2:00 AM
Ehatv

Ehatv

Next Story