☰
✕
న్యూ ఇయర్ వేడుకలకు గోవాకు వెళ్లిన ఏపీ యువకుడిని కర్రలతో రెస్టారెంట్ మాఫియా కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
x
న్యూ ఇయర్ వేడుకలకు గోవాకు వెళ్లిన ఏపీ యువకుడిని కర్రలతో రెస్టారెంట్ మాఫియా కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నూతన సంవత్సర వేడుకల కోసం తాడేపల్లిగూడెం(Tadepalli gudem) నుండి గోవా(Goa) ఎనిమిది మంది స్నేహితుల బృందం వెళ్లింది. డిసెంబర్ 29 ఆదివారం అర్ధరాత్రి గోవాలో రెస్టారెంట్‌కు యువతీ, యువకులు వెళ్లారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి ఫుడ్ ఆర్డర్ విషయంలో టూరిస్ట్‌లకు గోవా బీచ్లోని ఓ రెస్టారెంట్ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రేట్ల గురించి ప్రశ్నించిన యువకులపై రెస్టారెంట్ నిర్వాహకులు దాడులకు తెగించారు. ఈ దాడిలో గాయపడ్డ తెలుగు యువకుడు రవితేజను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. దీంతో రవితేజ(Ravi Teja) కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.
ehatv
Next Story