రథసప్తమి.. ప్రత్యక్ష నారాయణుడైన ఆ సూర్య భగవానుడు పుట్టిన రోజు. సకల జగత్తుకు వెలుగునిచ్చే ఆదినారాయణుడు ఏడు గుర్రాలు పూన్చిన బంగారుథంపై తన దిశా నిర్దేశాన్ని మార్చుకునే రోజు. ఇది ఉత్తరాయన ప్రారంభ సూచిక. సూర్యుడు వివేకానికీ, విజ్ఞానానికి ప్రతీక. సూర్య భగవానుడు మానవాళి అంతరాంతరాల్లో, అంతరాత్మ అనే ప్రమిదలో దీపంగా ప్రజ్వలిస్తాడు. దివాకరుడి పుట్టిన రోజు సందర్భంగా తెలుగు నేలలో వెలసిన కొన్ని సూర్య దేవాలయాలను సందర్శించుకుందాం!

రథసప్తమి.. ప్రత్యక్ష నారాయణుడైన ఆ సూర్య భగవానుడు పుట్టిన రోజు. సకల జగత్తుకు వెలుగునిచ్చే ఆదినారాయణుడు ఏడు గుర్రాలు పూన్చిన బంగారుథంపై తన దిశా నిర్దేశాన్ని మార్చుకునే రోజు. ఇది ఉత్తరాయన ప్రారంభ సూచిక. సూర్యుడు వివేకానికీ, విజ్ఞానానికి ప్రతీక. సూర్య భగవానుడు మానవాళి అంతరాంతరాల్లో, అంతరాత్మ అనే ప్రమిదలో దీపంగా ప్రజ్వలిస్తాడు. దివాకరుడి పుట్టిన రోజు సందర్భంగా తెలుగు నేలలో వెలసిన కొన్ని సూర్య దేవాలయాలను సందర్శించుకుందాం!

ప్రాచీన కాలం నుంచే సూర్యారాధన ఉంది. బుద్ధి వికసించిన తొలినాళ్లలో నరుడికి ప్రత్యక్ష నారాయణుడు సూర్యుడే! వెలుగును వేడిని ప్రసాదిస్తున్న ఆ దినకరుడంటే భయంతో కూడిన భక్తి. సకల చరాచర సృష్టి మనుగడకు ఆయనే కారణమన్న విశ్వాసం. అందుకే సూర్యుడిని ఆరాధించడం ఆరంభించారు. వేడుకునేందుకు ఎన్నో ఆలయాలను నిర్మించారు. ప్రాచీన నాగరితకలతో పాటుగా పురాతన ఆలయాలూ చాలా మట్టుకు కనుమరుగయ్యాయి. కొన్ని మిగిలాయి. సిరియాలోని(Syria) వేల సంవత్సరాల కిందటి సూర్య ఆలయం బాల్షమిన్‌ను(Balshamin) తొమ్మిదేళ్ల కిందట ఐసీస్‌ ఉగ్రవాదులు మత మౌఢ్యంతో పూర్తిగా ధ్వంసం చేశారు..

సూర్యారాధన ఒక్క మన భారతావనిలోనే కాదు. ప్రపంచమంతటా కనిపిస్తుంది.. మహోజ్వలంగా వెలుగొందిన అన్ని ప్రాచీన నాగరికతల్లోనూ సూర్యారాధన కనిపిస్తుంది.. అంతకు ముందు ఆదిమవాసులు సూర్యుడిని గొప్ప వేటగాడి రూపంలో పూజించారు.. ఎన్నో దేశాలు, రాజవంశాలు సూర్యడి పేరుతో అవతరించాయి. శ్రీరామచంద్రుడు సూర్యవంశపు రాజే! ఈజిప్ట్‌, జపాన్‌, మెక్సికో, పెరూ, మెసపోటేమియా మొదలైన దేశాలలో సూర్యుడిని భగవంతుడి స్వరూపంగా కొలుస్తారు.మనక్కూడా ప్రత్యక్ష నారాయణుడు సూర్యుడేగా!

సూర్యదేవాలయాల్లో కొన్నే మనకు సుపరిచితాలు. తెలియనివి చాలా ఉన్నాయి.. ఒడిషాలోని(Odisha) కోణార్క్‌ ఆలయం(Konark temple) ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఆ ఆలయ విశిష్టత గురించి అందరికీ తెలుసు. కాకపోతే ఉత్తరాఖండ్‌లో ఓ ప్రాచీన సూర్యాలయం ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆల్మోరా(Aalmora) జిల్లా కటార్‌మల్‌(Katarmal) అనే చిన్న గ్రామంలో పురాతన సూర్యదేవాలయం ఉంది. సముద్రమట్టానికి దాదాపు రెండు వేల మీటర్ల ఎత్తులో ఉన్న ఆలయాన్ని తొమ్మిదో శతాబ్దంలో కటారమల్లుడనే రాజు నిర్మించాడు. ఆలయ ప్రాంగణంలో 40కి పైగా చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి.

వీటిల్లో ఓ విగ్రహం దొంగలపాలు కావడంతో ముందు జాగ్రత్తగా ఆలయానికి ఉన్న కలప ద్వారబంధాలు.. ప్రధాన నిర్మాణాలు. అద్భుతమైన శిల్పాలను ఢిల్లీలోని నేషనల్‌ మ్యూజియంలో(National musem) భద్రపరిచారు. అలాగే తమిళనాడులోని కుంభకోణం దగ్గరలో ఓ సూర్యదేవాలయం ఉంది. స్థానికులు సూర్యనార్‌ కోవిల్‌గా పిల్చుకుంటారు. సూర్యభగవానుడు తన ఇద్దరు భార్యలు ఉషాదేవి. ప్రత్యూషదేవీలతో కలిసి భక్తులకు దర్శనమిస్తాడు. మందస్మితమైన మోముతో. ఇరు చేతులలో తామరపువ్వులతో ఉన్న స్వామి విగ్రహాన్ని ఆకట్టుకునే రితీలో తీర్చదిద్దారు. పదకొండో శతాబ్దంలో చోళ రాజు కుళుత్తోంగుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. తర్వాతి కాలంలో విజయనగర రాజులు ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఇక్కడ రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతాయి.

Updated On 15 Feb 2024 6:55 AM GMT
Ehatv

Ehatv

Next Story