అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొనడానికి రామ్ చరణ్, ఉపాసన జామ్‌నగర్ చేరుకున్నారు.
రామ్ చరణ్ తేజ్.. ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ కు ఉన్న ఇంపార్టెన్స్ ను చూసి నార్త్ జనాలు ఫిదా అయ్యారు. ముఖ్యంగా హిందుత్వం విషయంలో రామ్ చరణ్ ను అభిమానించే వాళ్లు నార్త్ లో కూడా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ లో ఆయనను చూసి సినిమా థియేటర్లలో జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసింది ఎవరూ మరచిపోరు. ఇప్పుడు అంబానీ కుటుంబంలో పెళ్ళికి హాజరైన రామ్ చరణ్ తేజ్ కు అక్కడ ఒక ఊహించని అనుభవం ఎదురైంది.
అనంత్ రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో రామ్ చరణ్ ను 'జై శ్రీ రామ్' నినాదాలతో స్వాగతం పలికారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొనడానికి రామ్ చరణ్, ఉపాసన జామ్‌నగర్ చేరుకున్నారు. ఫంక్షన్ హాల్లోకి వస్తుండగా కొందరు ఫోటోగ్రాఫర్లు వీరిని తమ కెమెరాల్లో బంధించారు. రామ్ చరణ్ ను చూస్తూ ఉన్న ప్రజలు జై శ్రీ రామ్ అంటూ నినాదాలు చేశారు. రామ్ చరణ్ నవ్వుతూ, నమస్కారం చేశారు. RRRలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించారు. క్లైమాక్స్‌లో బ్రిటీష్ వారితో పోరాడే చోట రామ్ చరణ్ ను చూసి నిజమైన రాముడు అని భావించారు. వారు రామ్ చరణ్‌ను రాముడి అవతరంలో చూసి ఫిదా అయిపోయారు. అప్పటి నుండి, రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా జై శ్రీ రామ్ నినాదాలు అందుకుంటూనే ఉన్నాడు.