మన దేశంలో గణేశ్ పండుగను ఎంత ఘనంగా జరుపుకుంటామో తెలియంది కాదు.
మన దేశంలో గణేశ్ పండుగను ఎంత ఘనంగా జరుపుకుంటామో తెలియంది కాదు. 9 రోజుల పాటు గణనాథుడికి భక్తులు పూజలు చేస్తారు. దేశవ్యాప్తంగా వైభంగా ఉత్సవాలు జరుగుతాయి. పలు రకాలతో వినాయకుడు.. భక్తులకు దర్శనం ఇస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా వినాయక చవితి వైభవంగా జరుగుతుంటుంది. ఖైరతాబాద్(Khairatabad)లో అతిపెద్ద వినాయకుడు కొలువుదీరగా.. బాలాపూర్(balapur) వినాయకుడి లడ్డు వేలాన్ని పవిత్రంగా నిర్వమిస్తారు. అయితే మనదేశంలో ముఖ్యమంగా ముంబై(Mumbai)లో గణేష్ పండగను అత్యంత వైభవంగా నిర్వాహిస్తారు. అయితే ముంబై లాల్‌బాగ్చయా(Lalbaugcha)విగ్రహానికి అనంత్ అంబానీ(Anant Ambani)-రిలయెన్స్ ఫౌండేషన్(Reliance Foundation)సంయుక్తంగా భారీ బహుమతిని అందించారు. ఈ ఏడాది విగ్రహాన్ని గణేష్ కమిటీ ఆవిష్కరించగా 20 కిలోల కిరీటం(20 kg gold crown)తో వినాయకుడు దర్శనమిస్తున్నారు. 20 కిలోల స్వర్ణ కిరీటాన్ని తమ ఆరాధ్యదైవానికి అందించి భక్తిని చాటుకున్నారు ముఖేష్ అంబానీ(Mukesh Ambani)చిన్న కొడుకు అనంత్ అంబానీ.