ముఖేశ్‌ అంబానీ(Mukesh Ambani)-నీతా అంబానీ(Neetha Ambani) దంపతుల చిన్న కొడుకు అనంత్‌ అంబానీ(Ananth Ambani) పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. రాధికా మర్చంట్‌తో(Radhika Merchant) జీవితాన్ని పంచుకోబోతున్నాడు అనంత్‌. ఈ ఏడాది మార్చిలో వీరి ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. గుజరాత్ జామ్‌నగర్లో జరిగిన ఈ సెలెబ్రేషన్స్‌కు దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు.

ముఖేశ్‌ అంబానీ(Mukesh Ambani)-నీతా అంబానీ(Neetha Ambani) దంపతుల చిన్న కొడుకు అనంత్‌ అంబానీ(Ananth Ambani) పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. రాధికా మర్చంట్‌తో(Radhika Merchant) జీవితాన్ని పంచుకోబోతున్నాడు అనంత్‌. ఈ ఏడాది మార్చిలో వీరి ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. గుజరాత్ జామ్‌నగర్లో జరిగిన ఈ సెలెబ్రేషన్స్‌కు దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఇప్పుడు పెళ్లి వేడుకలు స్టార్టయ్యాయి. మే 29వ తేదీన ఇటలీలో(Italy) పెళ్లి వేడుకలు మొదలయ్యి జూన్‌ 1వ తేదీన స్విట్జర్లాండ్‌లో(switzerland ) ముగియబోతున్నాయి. అంటే వీరి పెళ్లి రెండు దేశాలలో జరగనుందన్నమాట! ఇంకో విశేషమేమిటంటే మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకలు మొత్తం భారీ క్రూయిజ్‌ షిప్‌లో జరగడం. ఈ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులతోపాటు బాలీవుడ్‌ టాప్‌ స్టార్లు కూడా హాజరుకానున్నారు. మొత్తం మూడు వందల మంది వీవీఐపీలకు ఆహ్వానం అందింది. ముఖేశ్‌ అంబానీ, నీతా అంబానీ, ఆకాశ్‌ అంబానీ తప్ప మిగతా అంబానీ కుటుంబం మొత్తం ఇప్పటికే అక్కడికి చేరుకుంది. పెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నది. బాలీవుడ్‌ నుంచి షారుక్ ఖాన్‌ కుటుంబం, రణబీర్‌ కపూర్‌,అలియా భట్‌ దంపతులు, సల్మాన్‌ ఖాన్‌, ప్రియాంక చోప్రా , నిక్‌ జొనాస్‌ దంపతులు, రణ్‌వీర్‌ సింగ్‌ ,దీపిక పడుకొనే దంపతులు, కియారా అద్వాణీ, సిద్ధార్థ్‌ మల్హోత్రా దంపతులు, సోనమ్‌ కపూర్‌ ,ఆనంద్‌ అహూజా దంపతులతో పాటు పలువురు స్టార్స్‌ కూడా హాజరుకాబోతున్నారు. మూడు రోజుల పాటు క్రూయిజ్‌లో జరిగే ఈ పార్టీలో నో ఫోన్‌ విధానాన్ని అనుసరించనున్నారు. ఈ వేడుకల అనంతరం జూలై 6వ తేదీ నుంచి 12వ తేదీ మధ్య ముంబాయిలో, ఆ తర్వాత ఢిల్లీలో కూడా వేడుకలను నిర్వహించనున్నారు.

Updated On 22 May 2024 2:43 AM GMT
Ehatv

Ehatv

Next Story