ఓ రోబో(Robo) బాత్‌రూమ్(Bathroom) డోర్ ఓపెన్ చేసి లోపలికివ వెళ్తుంది. టాయిలెట్ సీట్‌ను బ్రష్‌లు, వైపర్‌లతో స్క్రబ్ చేసి క్లీన్ చేస్తుంది. అమెరికాకు చెందిన సోమాటిక్ అనే కంపెనీ జానిటర్ అనే రోబోను తయారుచేసింది.
ఓ రోబో(Robo) బాత్‌రూమ్(Bathroom) డోర్ ఓపెన్ చేసి లోపలికివ వెళ్తుంది. టాయిలెట్ సీట్‌ను బ్రష్‌లు, వైపర్‌లతో స్క్రబ్ చేసి క్లీన్ చేస్తుంది. అమెరికాకు చెందిన సోమాటిక్ అనే కంపెనీ జానిటర్ అనే రోబోను తయారుచేసింది. ఇది తనంతట తాను వాష్‌రూం డోర్ ఓపెన్ చేసి, టాయిలెట్ బేసిన్‌ను శుభ్రపరిచడమే కాకుండా ఇతర ప్రదేశాలను క్లీన్ చేసి మళ్లీ తలుపు తీసుకొని వెళ్లిపోతుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ రోబోట్‌కు మహీంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర(Anand Mahindra) ఆకర్షితులయ్యారు. జానిటర్ రొబోపై ఆయన స్పందించారు. ఆటో మేకర్స్‌గా మా ఫ్యాక్టరీలలో రోబోలను ఉపయోగిస్తున్నాం, కానీ టాయిలెట్లను శుభ్రపరిచే ఈ రోబోను చూడలేదు. ఇలాంటి రోబోలు మాకు కావాలని, మా ఫ్యాక్టరీల్లో వీటిని ఉపయోగించుకుంటామని సోషల్ మీడియా(social media) ద్వారా ఆయన వెల్లడించారు. బాత్‌రూమ్‌లను శుభ్రపరిచే ఈ వీడియో సోషల్ మీడియా టాయిలెట్ మధ్య చర్చకు దారితీసింది. కొంతమంది పరిశుభ్రత ప్రమాణాలు, సామర్థ్యాన్నిమెరుగుపరుస్తుందని ప్రశంసించారు, మరికొందరు ఉపాధికి సంబంధించిన చిక్కులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఇటువంటి సాంకేతికతలు ఉద్యోగ నష్టాలకు దారితీస్తాయని భయపడుతున్నారు.