కోచింగ్‌ సెంటర్లకు(Coaching Centers) మన అమీర్‌పేట(Ameerpet) ఎంత ఫేమసో రాజస్థాన్‌లోని(Rajasthan) కోటా పట్టణం(Kota town) అంతకు ట్రిపుల్‌ ఫేమస్‌! విషాదం ఏమిటంటే కోచింగ్‌ హబ్‌గా పేరొందిన ఈ పట్టణంలో విద్యార్థుల ఆత్మహత్యలు(Sucides) పెరిగిపోవడం! ఇదే తల్లిదండ్రులను విపరీతమైన ఆందోళనకు గురి చేస్తోంది. పోటీ పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తాయేమోనన్న భయం, పరీక్ష తప్పుతామేమోనన్న ఆందోళనతో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 24 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కోటా పట్టణం పోటీ ప్రవేశ పరీక్షలకు(Compitative Exams) చాలా ప్రసిద్ధి. శిక్షణ కోసం చాలా మంది విద్యార్థులు ఇక్కడికి వస్తుంటారు. వివిధ రాష్ట్రాల విద్యార్థులు పోటీ ప్రవేశ పరీక్షల్లో కోచింగ్‌ తీసుకుంటుంటారు. ప్రస్తుతం మూడు లక్షల మంది విద్యార్థులు కోటా పట్టణంలో ఉన్నారు. వీరంతా వివిధ పోటీ పరీక్షలకు కోచింగ్‌ తీసుకుంటున్నారు. వీరిలో చాలా మంది నిరుపేద కుటుంబాలకు చెందిన వారే! పోటీ పరీక్షలో నెగ్గగలమో లేదో అన్న అనుమానం వారిని మానసిక ఒత్తిళ్లకు గురి చేస్తున్నది.

తల్లిదండ్రులకు భారం కాకూడదని ఆలోచనతో వారు అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఆగస్టు 27వ తేదీన పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఇద్దరు విద్యార్థులు కొన్ని గంటల వ్యవధిలోనే చనిపోయారు. అధికారుల వెల్లడించిన వివరాల ప్రకారం 2023లో ఇప్పటివరకు 24 మంది విద్యార్ధులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఈ మరణాలపై చాలా మంది కలత చెందుతున్నారు. విచారం వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర కూడా ఆందోళన చెందారు. 'విద్యార్థులు చనిపోయారనే వార్త చూసి కలత చెందాను. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరం. పంచుకోవడానికి నా దగ్గర గొప్ప జ్ఞానం లేదు. కానీ మీ అందరికీ ఒకటి చెప్పాలని అనుకుంటున్నా. ఈ దశలో మీ లక్ష్యం మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం కాదు. మిమ్మల్ని మీరు గుర్తించడం. పరీక్షలో విజయం సాధించకపోవడం అనేది కేవలం స్వీయ అన్వేషణ ప్రయాణంలో భాగం. మీ నిజమైన ప్రతిభ మరెక్కడో ఉందని అర్థం. శోధిస్తూ ఉండండి, ప్రయాణం చేస్తూ ఉండండి. చివరికి ఎందులో ప్రతిభావంతులో మీరే గుర్తిస్తారు. అనుకున్నది సాధిస్తారు’ అని ఆనంద మహీంద్ర ట్వీట్‌ చేశారు.

Updated On 30 Aug 2023 5:51 AM GMT
Ehatv

Ehatv

Next Story