శ్రీరాముడిపై(Srirama) భక్తిని ప్రదర్శించేందుకు ఓ యువతి సాహసం చేసింది. బ్యాంకాక్‌లో(Bangkok) 13 వేల అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకింది. అయోధ్య రామమందిర(Ayodhya Ram Mandir) చిత్రం, జైరాం(Jairam) అని రాసి ఉన్న జెండాను పట్టుకొని ఆమె ఈ సాహసానికి ఒడిగట్టింది. అయోధ్య రామమందిరంలో ఈనెల 22న ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్న సందర్భంగా.. సరిగ్గా నెల రోజులకు ముందు అంటే డిసెంబర్ 22న ఈ సాహాసానికి అనామిక శర్మ(Anamika Sharma) అనే యువతి పాల్పడింది.

శ్రీరాముడిపై(Srirama) భక్తిని ప్రదర్శించేందుకు ఓ యువతి సాహసం చేసింది. బ్యాంకాక్‌లో(Bangkok) 13 వేల అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకింది. అయోధ్య రామమందిర(Ayodhya Ram Mandir) చిత్రం, జైరాం(Jairam) అని రాసి ఉన్న జెండాను పట్టుకొని ఆమె ఈ సాహసానికి ఒడిగట్టింది. అయోధ్య రామమందిరంలో ఈనెల 22న ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్న సందర్భంగా.. సరిగ్గా నెల రోజులకు ముందు అంటే డిసెంబర్ 22న ఈ సాహాసానికి అనామిక శర్మ(Anamika Sharma) అనే యువతి పాల్పడింది. రాముడిపై ఉన్న భక్తిభావాన్ని ప్రదర్శించేందుకే ఈ సాహసం చేశానని అనామిక శర్మ వెల్లడించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని(Uttar Pradesh) ప్రయాగ్‌రాజ్‌కు చెంది అనామిక శర్మ తండ్రి ప్రోత్సాహంతో స్కై డైవింగ్‌పై ఆసక్తి ఏర్పడిందని తెలిపింది. తన తండ్రి ఎయిర్‌ఫోర్స్‌లో పని చేసినందున చిన్నప్పటి నుంచే స్కై డైవింగ్‌ నేర్చుకున్నట్లు ఆమె వెల్లడించింది. రాముడిపై ఉన్న భక్తిని చాటేందుకే తన వంతు ప్రయత్నం చేశానని అనామిక వివరించింది. ఇందుకుగాను తన స్వస్థలంతో పాటు బ్యాంకాక్‌లోనూ ప్రశంసంలు వస్తున్నాయని అనామికశర్మ తెలిపింది.

Updated On 4 Jan 2024 5:33 AM GMT
Ehatv

Ehatv

Next Story