తెలుగుదేశంపార్టీకి(TDP) ఈ పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదు. చంద్రబాబు తెలుగుదేశంపార్టీ ఇంతకు ముందు కూడా పొత్తులు పెట్టుకునే అధికారంలోకి వచ్చింది. పొత్తులు పెట్టుకున్నా ఓడిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం పొత్తు కోసం వెంపర్లాడింది. ఎలాగోలా పవన్ కల్యాణ్‌తో(Pawan kalayan) పొత్తుపెట్టుకున్నారు. ఆ పొత్తు గెలవాడానికి సరిపోదనే అనుమానం వచ్చి బీజేపీ(BJP) శరణుజొచ్చారు.
తెలుగుదేశంపార్టీకి(TDP) ఈ పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదు. చంద్రబాబు తెలుగుదేశంపార్టీ ఇంతకు ముందు కూడా పొత్తులు పెట్టుకునే అధికారంలోకి వచ్చింది. పొత్తులు పెట్టుకున్నా ఓడిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం పొత్తు కోసం వెంపర్లాడింది. ఎలాగోలా పవన్ కల్యాణ్‌తో(Pawan kalayan) పొత్తుపెట్టుకున్నారు. ఆ పొత్తు గెలవాడానికి సరిపోదనే అనుమానం వచ్చి బీజేపీ(BJP) శరణుజొచ్చారు. అవసరార్థం కుదుర్చుకున్న పొత్తు కాబట్టి వారు అడిగిన స్థానాలను ఇచ్చేశారు. తెలుగుదేశంపార్టీకి కంచుకోటలనుకున్న నియోజకవర్గాలను కూడా మరో ఆలోచన లేకుండా జనసేనకు(Janasena), బీజేపీకి కట్టబెట్టారు. ఎగ్జాంపుల్ అనకాపల్లినే(anakapally) తీసుకోండి. అక్కడ నుంచి టీడీపీ అనేకసార్లు విజయం సాధించింది. లోక్‌సభ నియోజకవర్గంలోనూ అంతే! అదే విధంగా పెందుర్తి కూడా టీడీపీకి బలమైన నియోజకవర్గమే! తెలుగుదేశంపార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎలమంచలిలో కూడా ఎక్కువ సార్లు విజయం సాధించింది.
ఇప్పుడీ స్థానాలు టీడీపీకి దక్కకుండాపోయాయి. అనకాపల్లి లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మూడు స్థానాలు జనసేన పార్టీ తీసుకుంది. కేవలం నాలుగు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే టీడీపీ పోటీ చేస్తున్నది. అనాకపల్లి లోక్‌సభ స్థానాన్ని బీజేపీకి కేటాయించింది. ఈ నియోజకవర్గంలో ఇంతకు ముందు ఎప్పుడూ లేనంత అయోమయం నెలకొంది. అనకాపల్లి లోక్‌సభకు ప్రచారం చేస్తున్నప్పుడు బీజేపీకి ఓటు వేయమని ఓటర్లకు విన్నవించుకోవాలి. అనాకపల్లి అసెంబ్లీ సీటు విషయానికి వస్తే జనసేన పార్టీ గుర్తు గాజుగ్లాస్‌కు వేయమని ఓటరుకు చెప్పాలి. అసలే చంద్రబాబుకు మాటలు తడబడుతున్నాయి. ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు. ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు ప్రచారం ఎలా ఉంటుందోనని టీడీపీ క్యాడర్ భయపడుతోంది. ఇక మూడు గుర్తులతో ప్రచారం చేయడం కష్టమే. ఓటర్లకు వీటి గురించి చెప్పడానికి నేతలే తడబడుతున్నారు. ఇక ఓటరు కన్ఫ్యూజ్ కాకుండా ఎలా ఉంటాడు? ఓటరు అయోమయానికి గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశంపార్టీపైనే ఉంటుంది. ఎందుకంటే కూటమిలో ఇదే పెద్ద పార్టీ కనుక. టీడీపీ క్యాడర్‌కు ఇది అదనపు పనే! ఈ గుర్తుల అయోమయంలో ఓటర్లు ఎవరికి ఓటు వేస్తారో అన్న ఆందోళన పార్టీ నాయకులకు ఉంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు ఈ సమస్య లేదు. ఫ్యాన్ గుర్తుకే రెండు ఓట్లు అని చెప్పుకుని తిరుగుతోందా పార్టీ!
అంటున్నారు.