కర్ణాటక(Karnataka) రాజధాని బెంగళూరులో(Bangalore) నీటి ఎద్దడి భయంకరంగా ఉంది. బిందెడు మంచినీటి కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. బోర్లు ఎండిపోయాయి. అపార్ట్‌మెంట్‌వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే ట్రాఫిక్ జామ్‌లతో సతమతమవుతున్న బెంగళూరు వాసులకు ఇప్పుడు నీటి ఎద్దడి(Water crises) తిప్పలు పెడుతోంది.
కర్ణాటక(Karnataka) రాజధాని బెంగళూరులో(Bangalore) నీటి ఎద్దడి భయంకరంగా ఉంది. బిందెడు మంచినీటి కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. బోర్లు ఎండిపోయాయి. అపార్ట్‌మెంట్‌వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే ట్రాఫిక్ జామ్‌లతో సతమతమవుతున్న బెంగళూరు వాసులకు ఇప్పుడు నీటి ఎద్దడి(Water crises) తిప్పలు పెడుతోంది. కొత్త సమస్యలను కొనితెచ్చిపెడుతోంది. బెంగళూరు అబ్బాయిలను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు అసలు ముందుకు రావడం లేదట! ఓ ఐటీ ఉద్యోగి ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో మొరపెట్టుకున్నాడు. ఏకంగా కాంగ్రెస్(congress) అగ్రనేత రాహుల్‌గాంధీని(Rahul gandhi) ట్యాగ్ చేస్తూ నీటి సమస్యను పరిష్కరించాలని కోరాడు. తద్వార తనకు పెళ్లి అయ్యేట్టు చేయమని వేడుకున్నాడు. ఆఫీసు స్పేస్ సరిపోవడం లేదు కాబట్టి ఇంటి నుంచే పని చేయమని ఉద్యోగులకు కంపెనీలు, ఆఫీసులు చెబుతున్నాయి. నీటి ఎద్దడి కారణంగా ఆఫీసుకు వెళ్లి పని చేయండంటూ అపార్ట్‌మెంట్ సొసైటీలు వేడుకుంటున్నాయి. ట్రాఫిక్ జామ్‌లను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వమేమో ఇంటి నుంచి బయటకు రాకండి అని చెబుతోంది. ఏం చేయడమా అని బెంగళూరువాసులు బెంగెట్టుకుంటున్నారు!