An Inter-Ministerial Central Team : వరదల నష్టం అంచనా వేసేందుకు తెలంగాణకు రానున్న కేంద్ర బృందం
ఇటీవలి భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో సంభవించిన వరదల(Floods) వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం(Central Team) జూలై 31 న తెలంగాణలో పర్యటించనుంది. ఈ బృందానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) సలహాదారు కునాల్ సత్యార్థి(Kunal Satyarthi) నేతృత్వం వహిస్తారు.
ఇటీవలి భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో సంభవించిన వరదల(Floods) వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం(Central Team) జూలై 31 న తెలంగాణలో పర్యటించనుంది. ఈ బృందానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) సలహాదారు కునాల్ సత్యార్థి(Kunal Satyarthi) నేతృత్వం వహిస్తారు. ఈ బృందంలో వ్యవసాయ, ఆర్థిక, జల శక్తి, విద్యుత్, రోడ్డు రవాణా మరియు హైవేలు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) మంత్రిత్వ శాఖల ప్రతినిధులు ఉంటారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amith shah) ఆదేశాల మేరకు కేంద్ర బృందం తెలంగాణకు వస్తున్నట్లు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత వారం రోజులుగా తెలంగాణలో కురుస్తున్న వర్షాల కారణంగా కనీసం 18 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు నిలిచిపోవడంతో సహాయక చర్యలు ఊపందుకున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సహాయక చర్యలను పర్యవేక్షించారని.. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో మాట్లాడినట్లు శనివారం రాత్రి అధికారిక ప్రకటనలో తెలిపారు.