రీసెంట్‌గా కొంత మంది విద్యార్థులను(Students) అమెరికా(America) వెనక్కి పంపిన విషయం తెలిసిందే కదా! పాపం లగేజ్‌తో పాటు ఆశలను, ఆశయాలను మూటకట్టుకుని, బంధు మిత్రులకు గొప్పగా చెప్పుకుని విమానం ఎక్కిన విద్యార్థులు అమెరికా గడ్డపై అడుగుపెట్టారో లేదో అక్కడ్నుంచి వెనక్కి వచ్చేశారు. అమెరికా అధికారులే వెనక్కి పంపేశారు. అక్కడి ఇమ్మిగ్రేషన్‌ అధికారులు (Immigration Officers) అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పలేక ఇబ్బంది పడ్డారు. వారు అడిగిన ప్రశ్నలతో పాటు సెల్‌ఫోన్‌ను(Smartphones) నిశితంగా పరిశీలించారు. ఫలానా విద్యార్థులు సోషల్‌ మీడియాలో పెట్టే పోస్టులు ఎలా ఉన్నాయో చెక్‌ చేశారు.

ఇది కూడా పరిశీలిస్తారా అని అనుకోడానికి లేదు. అమెరికా నిఘా విభాగం చాలా పవర్‌ఫుల్‌.. ప్రతీ విషయం వారికి తెలుస్తుంటుంది. అందుకే అమెరికాకో, ఇతర దేశాలకో చదువుకోవడానికి వెళుతున్న విద్యార్థులు ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. సోషల్‌ మీడియాలో పోస్టుల(Social media Post) విషయంలో ఏమరపాటుగా మెలగాలి. విద్వేషపు పోస్టులు(Hateful Post) పెట్టినా, ద్వేషించే పోస్టులు పెట్టినా మీకు విదేశాల్లో చదువుకునే అవకాశం రాదు.

అన్ని డ్యాకుమెంట్లతో(Documents) ఆ దేశాల ఎయిర్‌పోర్టుల్లో అడుగు పెట్టినా, ఈ కారణంతో వెనక్కి తిరిగి రావాల్సిందే. విదేశాల్లో చదువుకోవాలనునే విద్యార్థులు సోషల్‌మీడియాలో పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల అమెరికా నుంచి వెనక్కి వచ్చిన విద్యార్థులు చెప్పడమేమిటంటే వీరిలో కొందరి సెల్‌ఫోన్లను భద్రతా సిబ్బంది, ఇమ్మిగ్రేషన్‌ అధికారులు స్వాధీనం చేసుకుని ఆ ఫోన్లను పరిశీలించారట! వాట్సప్‌ చాట్‌ను పరిశీలిస్తే అమెరికాలో పార్ట్‌టైమ్‌(Part time) జాబ్‌ల కోసం విద్యార్థులు వెతికినట్టు తేలింది.

ఇక ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌ ఇతర సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో విద్వేషం కలిగించే పోస్టులు పెట్టినట్టు తెలిసినా అమెరికాలో అడుగుపెట్టలేరు. ఇప్పటికే అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ అంచనా ప్రకారం లక్షన్నర హేట్‌స్పీట్‌ సైట్లను గుర్తించారు. వీటిని ట్యాగ్‌చేసినా, కామెంట్లు పెట్టినా తిరస్కరించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇతరుల జీవితాల గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసినా, అబద్దపు అభిప్రాయాలను పోస్టు చేసినా అమెరికా తిరస్కరణ తప్పదు.

అలాగే జాతి, లింగ వివక్షకు తావునిచ్చే పోస్టులు పెట్టినట్టు తేలినా వెనక్కి పంపించే అవకాశాలుంటాయి. కులం, మతం, ప్రాంతీయతత్వాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. అమెరికాకు వీసా దొరికితే సరిపోదు.. వీసా దొరికింది కదా అని అనుకునేసి సంబరపడటానికి వీల్లేదు. అమెరికా చేరుకున్నాక కూడా బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(Border Security Force) పర్మిషన్‌ ఇస్తేనే,

ఇమ్మిగ్రేషన్ అధికారులు అంగీకరిస్తేనే అమెరికాలో ఉండగలం! కొన్ని సందర్భాలలో భద్రతాసిబ్బంది సెల్‌ఫోన్‌ను వారి ఆధీనంలోకి తీసుకుని వడబోస్తారు. పోస్టులు, కమ్యూనికేషన్‌లను(Communication Skills) పరిశీలిస్తారు. ఇలాంటప్పుడు ఏదై నా అనుమానం వస్తే వెంటనే తిరస్కరిం చి వెనక్కి పంపిస్తారు.. అంచేత విద్యార్థులు జాగ్రత్త! అమెరికాకు వెళ్లదల్చుకుంటే మాత్రం వాట్సప్‌ యూనివర్సిటీ మేథావులు పంపించే మెసేజ్‌లను షేర్‌ చేయకండి..

Updated On 21 Aug 2023 1:21 AM GMT
Ehatv

Ehatv

Next Story