గుండెపోట్ల (Heart Strokes) వల్ల ఎప్పుడు, ఎవరు మృత్యువాత పడుతున్నారో తెలియడం లేదు. చిన్న వయసు నుంచి అన్ని వయసుల వారికి గుండెపోట్లు రావడంతో మరణాలు సంభవిస్తున్నాయని వార్తలు వింటునే ఉన్నాం. తాజాగా గుండెపోటు ఓ సీనియర్‌ ప్రొఫెసర్‌ను (Professior)బలితీసుకుంది.

ఐఐటీ కాన్పూర్‌ (IIT Khanpur)లో విషాదం చోటుచేసుకుంది. 53 ఏళ్ల సీనియర్‌ ప్రొఫెసర్‌ సమీర్‌ ఖండేకర్‌ (Sameer Khandekar) విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా స్టేజ్ పైనే కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఐఐటీ కాన్పూర్‌లో విషాద ఛాయలు నెలకొన్నాయి. డీన్‌గా, మెకానికల్ ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌గా సమీర్‌ ఖండేకర్‌ వ్యవహరిస్తున్నారు. శుక్రవారం విద్యార్థుల సభలో ప్రసంగిస్తుండగా అతనికి తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చింది, విపరీతంగా చెమటలు పట్టాయి. ఏం జరుగుతుందో అని అర్థమయ్యేలోపే అతను వేదికపై కుప్పకూలిపోయాడు. గత ఐదేళ్ల క్రితమే ఖండేకర్‌కు అధిక కొలెస్ట్రాల్‌ (cholesterol) ఉందని గతంలో ఆయనతో పనిచేసిన ఓ ప్రొఫెసర్‌ వెల్లడించారు. మృతదేహాన్ని ఐఐటీ కాన్పూర్‌లోని ఆరోగ్య కేంద్రంలో ఉంచామని, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ (Cambridge University).లో చదువుతున్న తన ఏకైక కుమారుడు ప్రవాహ ఖండేకర్ (Pravaha Khandekar) వచ్చిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహిస్తామని ఐఐటీ కాన్పూర్‌ అధికారులు వెల్లడించారు.

Updated On 24 Dec 2023 12:08 AM GMT
Ehatv

Ehatv

Next Story