Killer Mother : పడక సుఖం కోసం పండంటి బిడ్డ గొంతు కోసిన తల్లి..!
పడక సుఖాల(Lust) కోసం పండంటి బిడ్డల ప్రాణాలు తీస్తున్నారు కొందరు కన్న తల్లులు(Mother). ఎన్ని కష్టనష్టాలకోర్చయినా కన్న పిల్లలను(Child) తల్లులు పెంచుతారు. చివరాఖరుకు అంగ వైకల్యంతో(Physically challenged) పుట్టిన బిడ్డలను కూడా కన్నతల్లి ప్రేమతో పెంచుకుంటుంది. కానీ ఓ మహిళ తల్లి అనే పదానికే కళంకం తెచ్చింది. నీచాతి నీచమైన దారుణానికి పాల్పడింది. తల్లి అనే పదానికి మాయని మచ్చలా మారింది.

mother killer
పడక సుఖాల(Lust) కోసం పండంటి బిడ్డల ప్రాణాలు తీస్తున్నారు కొందరు కన్న తల్లులు(Mother). ఎన్ని కష్టనష్టాలకోర్చయినా కన్న పిల్లలను(Child) తల్లులు పెంచుతారు. చివరాఖరుకు అంగ వైకల్యంతో(Physically challenged) పుట్టిన బిడ్డలను కూడా కన్నతల్లి ప్రేమతో పెంచుకుంటుంది. కానీ ఓ మహిళ తల్లి అనే పదానికే కళంకం తెచ్చింది. నీచాతి నీచమైన దారుణానికి పాల్పడింది. తల్లి అనే పదానికి మాయని మచ్చలా మారింది. పరాయి మగాడితో సుఖానికి అలవాటు పడి కూతురిని కడతేర్చింది. కర్నాటకలో(Karnataka) ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కర్ణాటక ధార్వాడ జిల్లాలోని కమలాపుర(Kamalapura) ప్రాంతంలో జ్యోతి(Jyothi) అనే మహిళ నివసిస్తోంది. కొంత కాలం క్రితమే భర్తకు విడాకులు(Divorce) ఇచ్చి దూరంగా ఉంటోంది. జ్యోతికి ఇద్దరు కవల పిల్లలు(Twins). ఇందులో సహనా హిరేమత్ అనే అమ్మాయి అంగ వైకల్యంతో జన్మించింది. జ్యోతి తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తుంది. ఈ క్రమంలోనే హుబ్లీలోని(Hubli) నవనగర్‌కు చెందిన జెనెకర రాహుల్ అనే వ్యక్తితో పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి(Extra Extramarital affair) దారి తీసింది. రాహుల్‌తో కలిసి జీవించేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే ఇందుకు తన కూతురు(Daughter) సహనా ఆమెకు ఇబ్బందిగా మారింది. అంగవైక్యలంతో ఉండడంతో సహానా పోషణ భారంగా మారడంతో 5 ఏళ్ల పాపను అడ్డు తొలగించుకోవాలనుకుంది. రంకు మొగుడితో సంసారం సాఫీగా సాగాలంటే ఈ పిల్లను అడ్డుతొలగిపోతే తనకు ఎదురు ఎవరూ ఉండరని అనుకుంది. ఇంకేముంది ఇంట్లో ఉన్న కూరగాయల కత్తితో పాప గొంతు కోసింది. ముక్కపచ్చలారని పసిపాపను కడతేర్చింది. సమాచారం అందుకున్న పోలీసులు(Police) నిందితురాలని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘనకార్యానికి సహకరించిన జ్యోతి ప్రియుడు రాహుల్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు కూడా జైలుకు వెళ్లడంతో మరో పాప అనాథగా మారింది.
