కేరళలోని(Kerala) త్రిస్సూర్‌(Thrissur) జిల్లాలో తరక్కల్‌ ఆలయ ఉత్సవాలు(Tarakkal Temple Festivals) ఘనంగా ముగిశాయి. ముగింపు జాతర శుక్రవారం రాత్రి జరిగింది. ముగింపు సమయంలో ఏనుగుపై(Elephant) అమ్మవారిని ఊరేగించారు.

కేరళలోని(Kerala) త్రిస్సూర్‌(Thrissur) జిల్లాలో తరక్కల్‌ ఆలయ ఉత్సవాలు(Tarakkal Temple Festivals) ఘనంగా ముగిశాయి. ముగింపు జాతర శుక్రవారం రాత్రి జరిగింది. ముగింపు సమయంలో ఏనుగుపై(Elephant) అమ్మవారిని ఊరేగించారు. ఆ ఏనుగుకు ఏమైందో ఏమోకానీ ఒక్కసారిగా అలజడి సృష్టించింది. తనను అదుపు చేసే మావటిపైనే మూడుసార్లు దాడికి దిగింది. అదృష్టం బాగుండబట్టి స్వల్ప గాయలతో ఆయన బయటపడ్డాడు. అక్కడిదో ఆ మత్తేభము శాంతించలేదు. అక్కడే ఊరేగింపు కోసం తీసుకొచ్చిన మరో ఏనుగుపై దాడికి దిగింది. రెండు ఏనుగులు యుద్ధానికి దిగాయి. దాంతో అక్కడ పరిస్థితి భీతావహంగా మారింది. ఆ ఏనుగుల మీద ఉన్నవారు కిందపడ్డారు. ఏనుగుల పోరును చూసి భయపడ్డ జనం ఉరుకులు పరుగులు తీశారు. ఈ హడావుడిలో కొందరు కిందపడి దెబ్బలు తగిలించుకున్నారు. మావటివాళ్లు అతికష్టంమీద మొదటి ఏనుగును కంట్రోల్ చేయగలిగారు. గాయపడినవారని దగ్గరలో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.

Updated On 23 March 2024 4:10 AM GMT
Ehatv

Ehatv

Next Story